Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Sep 13 , 2025 | 07:46 AM
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్: ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి(Tirupati-Anakapalle-Tirupati) మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈనెల 17 నుంచి నవంబరు 26 వరకు (బుధ) సంబల్‌పూర్- ఇరోడ్ (08311) మధ్య 11 రైళ్లు,

ఈనెల 19నుంచి నవంబరు 28 వరకు (శుక్ర)ఇరోడ్- సంబల్‌పూర్ (08312) మధ్య 11 రైళ్లు, ఈనెల 15 నుంచి నవంబరు 24 వరకు (సోమ) విశాఖపట్నం- తిరుపతి(Visakhapatnam-Tirupati)(08583) మధ్య 11 రైళ్లు, ఈనెల 16నుంచి నవంబరు 25 వరకు (మంగళ) తిరుపతి-విశాఖపట్నం (08584) మధ్య 11 ప్రత్యేకరైళ్లు నడుస్తాయని వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News