Girls Hostel Student Incident: తుని ఘటన మరవకముందే.. మరో విద్యార్థినిపై అత్యాచారం..
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:01 PM
మనవరాలి వయస్సు ఉండే బాలికలపై కొందరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తునిలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. తునిలో 8వ తరగతి చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా రాజమహేంద్రవరంలో మరో దారుణం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా, అక్టోబర్ 22: నేటి కాలంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట యువతులు, బాలికలపై అత్యాచారాలు, దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అభంశుభం తెలియని చిన్న పిల్లలు, బాలికలపై కొందరు కామాంధులు కన్నేసి కాటేస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. మనవరాలి వయస్సు ఉండే బాలికలపై కొందరు వృద్దులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. కాకినాడ జిల్లా తుని(Tuni)లో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణ. తునిలో 8వ తరగతి చదువుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. ఆ ఘటన మరవక ముందే తాజాగా రాజమహేంద్రవరంలో మరో దారుణం చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి (East Godavari News)జిల్లా రాజమహేంద్రవరంలో సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన బాలికల వసతి గృహంలో చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. అజయ్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒక లాడ్జిలో విద్యార్థి( Student Hostel Crime)పై నిందితుడు అజయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడికి మరో యువకుడు సహకరించాడు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడు, అతడికి సహకరించిన వ్యక్తి పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థిని అత్యాచార ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు.
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి గయాజుద్ధీన్ ఈ ఘటన( Student Hostel Crime)పై విచారణ జరిపి.. నివేదికను కలెక్టర్ కు అందజేశారు. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించామని తెలిపారు. భవిష్యత్తులో ఇటవంటి సంఘటనలు జరగకుండా హాస్టల్స్(Rajahmundry Girls Hostel)లో చర్యలు చేపడతామని, విద్యార్థినుల జోలికి వెళ్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
Saira Banu: కడపలో ఉగ్రవాది అబూబకర్ సిద్ధికి భార్య సైరా భాను ను కస్టడీకి తీసుకున్న NIA
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి