Tragic Love Story: పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేమ జంట ఆత్మహత్య
ABN , Publish Date - Jul 06 , 2025 | 08:22 AM
కలిసి జీవించలేమనుకున్న ఓ ప్రేమ జంట మరణంతో ఒకటయ్యారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అక్కపల్లి సమీపంలో జరిగింది. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రకాశం: కలిసి జీవించలేమనుకున్న ఓ ప్రేమ జంట మరణంతో ఒకటయ్యారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలోని (Prakasam District) కొమరోలు మండలం అక్కపల్లి సమీపంలో జరిగింది. పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య (Tragic Love Story) చేసుకున్నారు. మృతులు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన భారతి, కంబగిరి రాముడుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు. ప్రేమ జంట ఆత్మహత్య విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇరువురు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే వరుసకు ఇద్దరు అన్నా, చెల్లెలు అవుతారని.. అందుకే పెళ్లికి ఒప్పుకోలేదని చెబుతున్నారు. కాగా.. గతంలో భారతికి వేరే వ్యక్తితో వివాహం జరిగింది. రాముడుపై ఉన్న ప్రేమతో భర్తకు దూరంగా భారతి ఉంటోంది. ప్రేమికుల ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రేమికుల మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమికుల ఆత్మహత్యతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి:
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్
For More AP News and Telugu News