Share News

Water Shortage: సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం.. రైతుల గగ్గోలు

ABN , Publish Date - Dec 08 , 2025 | 08:10 AM

జిల్లాలో సాగర్‌ నీటి పంపిణీ ఈసారి గందరగోళంగా మారింది. సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు.

Water Shortage: సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం.. రైతుల గగ్గోలు
Prakasam District Water Shortage

  • సాగునీటి పంపిణీ అస్తవ్యస్తం

  • జిల్లాకు తగ్గిన సాగర్‌ జలాలు

  • వాటా ప్రకారం సాధించడంలో విఫలమవుతున్న అధికారులు

  • అధికంగా వాడుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు

  • ఓబీసీ పరిధికి తీవ్ర అన్యాయం

  • 650 క్యూసెక్కులు ఏవీ?

వాటా ప్రకారం సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలు (ప్రకాశం సరిహద్దు)కు 2,850 క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం 2,179 క్యూసెక్కుల నీరు మాత్రమే ఉన్నతాధికారులు అందిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాకు ఇంకా 650 క్యూసెక్కులు విడుదల చేయాలి. ఈ నీటి మొత్తాన్ని గుంటూరు జిల్లా రైతులు అదనంగా వాడుకుంటుండటంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. జిల్లాకు తక్కువగా నీరు విడుదలవుతుండటంతో ఆ ప్రభావం బ్రాంచ్‌ కాలువలపై పడుతోంది. ఈ కాలువ పరిధిలో కర్షకులకు అన్యాయం జరుగుతోంది.


దర్శి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగర్‌ నీటి పంపిణీ ఈసారి గందరగోళంగా మారింది. సాగర్‌ డ్యామ్‌ నుంచి కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా అవి బుగ్గవాగుకు చేరుతున్నాయి. అక్కడి నుంచి 8,845 క్యూసెక్కులు ప్రధాన కాలువకు సరఫరా చేస్తున్నారు. ఆ నీటిలో గుంటూరు బ్రాంచ్‌ కాలువకు రెండు వేల క్యూసెక్కులు, అద్దంకి బ్రాంచ్‌ కాలువకు (ఏబీసీ) 1,510 క్యూసెక్కులు, ఏబీసీలోని 18వ మైలు (ప్రకాశం బార్డర్‌)కు వెయ్యి క్యూసెక్కులు, సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలు (ప్రకాశం సరిహద్దు)కు 2,179 క్యూసెక్కులు పంపిణీ చేస్తున్నారు. వాటా ప్రకారం జిల్లాకు నీటి తరుగుపోను 43 శాతం విడుదల చేయాలి. అధికారుల లెక్కల ప్రకారం సాగర్‌ కుడి కాలువకు పదివేల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా జిల్లా సరిహద్దుకు వచ్చేసరికి 85మైళ్ల దూరానికి మైలుకు పది క్యూసెక్కుల చొప్పున 850 క్యూసెక్కుల నీరు వృథా కింద పోతుంది. 9,150 క్యూసెక్కుల నికర జలాల్లో 43శాతం వాటా ప్రకారం 3,850 క్యూసెక్కులు జిల్లాకు అందాలి. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి బ్రాంచ్‌ కాలువ 18వ మైలుకు (ప్రకాశం బార్డర్‌) వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.


ప్రస్తుతం పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు(పీబీసీ) 655 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు (ఓబీసీ) 568 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. సుమారు 1.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఓబీసీకి అతి తక్కువగా నీరు సరఫరా అవుతుండటంతో చివరి భూములకు చేరక రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఓబీసీలో 800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తేనే అన్ని మేజరు,్ల మైనర్లకు నీరందుతుంది. జిల్లా అధికారులకు ఈ విషయం స్పష్టంగా తెలిసినా సాగునీటి పంపిణీలో సమన్వయంపై దృష్టిపెట్టడం లేదు.


చివరి ఆయకట్టు రైతులు గొడవ చేసినప్పుడు కొద్దిరోజులు కొంతమేరకు ఓబీసీకి నీటి పరిమాణం పెంచుతున్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథ పరిస్థితి. అతి తక్కువగా నీరు విడుదల చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు. ఒకపక్క తొలుత వరినాట్లు వేసిన రైతులు పంట కోస్తుండగా, చివరి ఆయకట్టు భూముల రైతులు ఇప్పుడు వరినాట్లు వేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కూడా చివరన ఉన్న ఓబీసీకి అతితక్కువగా నీరు విడుదల చేయటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిని గుర్తించి జిల్లాకు వాటా ప్రకారం నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఓబీసీకి తీవ్ర అన్యాయం

ప్రస్తుతం పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు(పీబీసీ) 655 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు (ఓబీసీ) 568 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. సుమారు 1.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా ఓబీసీకి అతి తక్కువగా నీరు సరఫరా అవుతుండటంతో చివరి భూములకు చేరక రైతులు గగ్గోలుపెడుతున్నారు. ఓబీసీలో 800 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తేనే అన్ని మేజరు,్ల మైనర్లకు నీరందుతుంది. జిల్లా అధికారులకు ఈ విషయం స్పష్టంగా తెలిసినా సాగునీటి పంపిణీలో సమన్వయంపై దృష్టిపెట్టడం లేదు. చివరి ఆయకట్టు రైతులు గొడవ చేసినప్పుడు కొద్దిరోజులు కొంతమేరకు ఓబీసీకి నీటి పరిమాణం పెంచుతున్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథ పరిస్థితి. అతి తక్కువగా నీరు విడుదల చేస్తూ రైతులను ఇబ్బందిపెడుతున్నారు. ఒకపక్క తొలుత వరినాట్లు వేసిన రైతులు పంట కోస్తుండగా, చివరి ఆయకట్టు భూముల రైతులు ఇప్పుడు వరినాట్లు వేస్తున్నారు. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో కూడా చివరన ఉన్న ఓబీసీకి అతితక్కువగా నీరు విడుదల చేయటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిని గుర్తించి జిల్లాకు వాటా ప్రకారం నీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. \


ఈ వార్తలు కూడా చదవండి..

విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

Read Latest AP News and National News

Updated Date - Dec 08 , 2025 | 08:10 AM