scrub Typhus: వామ్మో స్క్రబ్ టైఫస్
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:13 AM
జిల్లాలో స్క్రబ్ టైఫస్ ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు.
మృతురాలు వైపాలెం హైస్కూల్ కుక్
దర్శిలో మరో కేసు నమోదు
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్సపొందుతూ మహిళ మృతి
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus Disease) ప్రబలుతోంది. దానిబారినపడి ఎర్రగొండపాలెంకు చెందిన పి.దానమ్మ (61) గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. దానమ్మ గత నెల 16న అనారోగ్యానికి గురయ్యారు. రెండ్రోజులు స్థానికంగానే వైద్యసేవలు పొందారు. అయినా తగ్గకపోవడంతో గతనెల 18న కుటుంబసభ్యులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో 29వతేదీన పరీక్షలు చేశారు. వాటిల్లో ఆమెకు స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
అక్కడే చికిత్స పొందుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆ మేరకు గుంటూరు వైద్యశాల నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమాచారాన్ని అందించారు. దానమ్మ వైపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుక్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఈ ఏడాది స్క్రబ్ టైఫస్ వ్యాధితో తొలి మరణం నమోదైంది. దర్శిలో మరొక కేసు నమోదైనట్లు సమాచారం. అనారోగ్యంతో ఓ వ్యక్తి దర్శిలోని ప్రభుత్వ వైద్యశాలకు రాగా పరీక్షల్లో ఆ వ్యాధి బారిన పడినట్లు గుర్తించారు. అయితే నిర్ధారణ కోసం వెంటనే అతని రక్తనమూనాలను ఒంగోలు రిమ్స్‌కు పంపించినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
Read Latest AP News and National News