Kakinada Girl Incident: బాలికపై వృద్ధుడి అత్యాచారం.. నిర్ధారించిన పోలీసులు..
ABN , Publish Date - Oct 22 , 2025 | 07:59 PM
తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
కాకినాడ జిల్లా: తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. సదరు వృద్ధుడు నిన్న బాలిక ఉంటున్న సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం వద్దకు వెళ్లాడు.
బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లే నెపంతో హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. తినుబండారాలు కొనిపెట్టి.. చివరకు సపోటా తోటలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై బలాత్కారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. తోటమాలి పరుగెత్తుకుంటూ వచ్చాడు. తోటమాలిని చూసి వృద్ధుడు.. అక్కడినుంచి బాలికతో పరారయ్యాడు. అనంతరం బాలికను గురుకుల పాఠశాల వద్ద దిగబెట్టి ఇంటికి వెళ్లిపోయాడు. నిందితుడిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
షోకాజ్ నోటీసు జారీ..
విద్యార్థినిపై అత్యాచార ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహం హాస్టల్ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప సేవలో ద్రౌపది ముర్ము.. శబరిమలను దర్శించుకున్న తొలి రాష్ట్రపతి
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ప్రధాని మోదీ గురించి ట్రంప్ ఏమన్నారంటే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి