AP News: గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజర్ రైలు
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:32 AM
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
గుంతకల్లు(అనంతపురం): రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లు నుంచి మార్కాపురం రోడ్డు (వయా నంద్యాల) డెయిలీ ప్యాసింజరు (నం. 57407/08) రైలును ప్రవేశ పెట్టనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంతకల్లు-మార్కాపురం రోడ్డు ప్యాసింజరు రోజూ సాయంత్రం 5.30 గంటలకు గుంతకల్లులో బయలుదేరి రాత్రి 8.30కి నంద్యాలకు రాత్రి 11.30కి మార్కాపురం రోడ్డు(Markapuram Road) స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు.

తిరుగు ప్రయాణపు రైలు మార్కాపురం రోడ్డు స్టేషన్‌లో రోజూ తెల్లవారుజామున 4.30కి బయలుదేరి నంద్యాల(Nandyal)కు ఉదయం 7.20కి, ఉదయం 10.30కి గుంతకల్లు స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ ప్యాసింజరు రైలు మద్దికెర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల(Dhone, Rangapuram, Bethamcherla, Panyam, Nandyal), గాజులపల్లి, దిగువమిట్ట, గిద్దలూరు,

సోమిదేవిపల్లి, జగ్గంభొట్ల, క్రిష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్ల మీదుగా మార్కాపురం రోడ్డుకు చేరుకుంటుందన్నారు. గుంతకల్లు, నంద్యాల, గిద్దలూరు, కంబం, డోన్ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వ్యాపారులు, ప్రజల నుంచి వస్తున్న అభ్యర్థనల మేరకు ఈ ప్యాసింజరు రైలును నడపడానికి నిర్ణయించినట్లు రైల్వే అధికారులు వివరించారు. త్వరలో రైలు ప్రారంభ తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News