MP Appalanaidu: జగన్ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి... టీడీపీ ఎంపీ విసుర్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:32 PM
MP Kalisetti Appalanaidu: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు.

ఢిల్లీ: అసెంబ్లీకి రాకుండా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) విమర్శించారు. జగన్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారా.. ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా.. అనేది ప్రజలకు తెలుసునని చెప్పారు. ఢిల్లీ వేదికగా ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇప్పుడు అమలు చేయడం కుదరదని చెప్పారు. జగన్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, చట్టం, ధర్మం గురించి జగన్ మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతోందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శలు చేశారు.
ALSO READ: Chandrababu : వైసీపీ ఆటలు సాగనివ్వను
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా జగన్ మాట్లాడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. చంద్రబాబు పాలనను ప్రజలు శభాష్ అంటున్నారన్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రైవేట్‌గా మాట్లాడుతున్న జగన్ వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేశారు. జగన్ ఆయన టీం వ్యవస్థను మొత్తం నాశనం చేశారని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎన్డీయే కూటమి సహాయ సహకారాలతో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిస్థితిని గాడిన పెడుతున్నారని తెలిపారు. జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అప్పుడు అసెంబ్లీకి జగన్ వస్తారేమో..: సోమిరెడ్డి
అసెంబ్లీలో మగ ఎమ్మెల్యేలకు అందాల పోటీలు పెడితే జగన్ అసెంబ్లీకి వస్తాడేమోనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. మగవారిలో అందాలను చూసే జగన్‌ను అసెంబ్లీకి రప్పించాలంటే ఈ ప్రత్యేక పోటీ కూడా పెట్టే అంశాన్ని పరిశీలించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరుతున్నానని అన్నారు. జగన్ అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్‌కు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ప్రతిపక్ష హోదా కోసం రాహుల్ గాంధీ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం జగన్‌కు తెలియంది కాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
సుప్రీంకోర్టు తిరస్కరించిన అంశంపై జగన్ హైకోర్టుకు వెళ్లటం అతని అవివేకమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 40లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినని చెబుతున్న జగన్ ఎక్కడ ఇచ్చాడో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. సభకు రాకుండా ఇంట్లో కూర్చుని భజన చేసుకుంటూ అసత్యాలు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. శాసనసభకు వచ్చే దమ్ములేక ఇంట్లో కూర్చుని ప్రెస్మీట్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలను బెదిరిస్తోందని జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జగన్ తన్ని తరిమేసిన పరిశ్రమల జాబితాను ఆయన మరిచారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
AP Council: వైసీపీ సభ్యులకు చుక్కలు చూపించిన మంత్రులు
Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు
CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అసలు కారణమిదే
Read Latest AP News And Telugu News