Minister Anam: అన్నదాత సుఖీభవ నిధులపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన
ABN , Publish Date - Jul 03 , 2025 | 02:16 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

నెల్లూరు: రాజకీయాలు, కులమతాలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం)నెల్లూరు జిల్లాలోని చేజర్లలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 హామీలను వరుసగా అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఎన్టీఆర్ పెన్షన్లు, దీపం పథకం, తల్లికివందనం అమలు చేశామని వెల్లడించారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నామని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.
ఏపీలో త్వరలో 80వేల కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. చేజర్లలో రూ.1.20కోట్లతో గ్రామ కొలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం సంగం బ్యారేజీ పనులని కట్ అండ్ పేస్ట్ లా చేశారని విమర్శించారు. ఇప్పుడు రూ.73 కోట్లతో సంగం బ్యారేజిపై రోడ్ నిర్మాణం చేపట్టి ముంబై హైవేకి కనెక్ట్ చేయబోతున్నామని తెలిపారు. చేజర్లలో రూ.2కోట్లతో చెన్నకేశవ స్వామి ఆలయం పున:నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
For More AP News and Telugu News