Share News

AP News: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో పర్మిట్ రూమ్స్‌కి పర్మిషన్..

ABN , Publish Date - Aug 12 , 2025 | 09:03 PM

ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్‌లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

AP News: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఏపీలో పర్మిట్ రూమ్స్‌కి పర్మిషన్..
Liquor

అమరావతి: మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. ఏపీ ఎక్సైజ్ రూల్స్ 2024ను సవరణ చేస్తూ.. ఏపీలో పర్మిట్ రూమ్‌లు అనుమతించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌ మీనా జీవో ఎంఎస్ నెంబర్ 273కి అనుమతించింది. పర్మిట్ రూమ్‌కు సంబంధించి నియమ నిబంధనలను ఉత్తర్వుల్లో వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు


పర్మిట్ రూమ్ లైసెన్స్‌కు యాన్యూవల్ ఫీజుగా రూ. 55 లక్షల వరకు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ. 5 లక్షలు ఫీజు.. రూ. 65 నుంచి రూ. 85 లక్షల రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉన్న వారికి రూ. 7 లక్షల 50 వేల ఫీజు నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. పర్మిట్ రూమ్ ఫీజును ఒకేసారి మొత్తం చెల్లించాలని సూచించారు. 2025- 26 సంవత్సరానికి మాత్రమే ఆ పర్మిట్ రూమ్ లైసెన్స్ వర్తిస్తుందని తెలిపారు. నవంబర్ 10వ తేదీ లోపల లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Updated Date - Aug 12 , 2025 | 09:20 PM