Share News

Police Custody: టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు

ABN , Publish Date - Jun 30 , 2025 | 10:18 AM

Kakani: గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అనధికారంగా కాకాణి టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనిపై కాకాణీని విచారించనున్నారు.

Police Custody: టోల్ వసూళ్ల కేసులో కాకాణీని ప్రశ్నించనున్న పోలీసులు
Kakani Govardhan Reddy

Nellore: సెంట్రల్ జైలులో పలు కేసుల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైసీపీ కీలకనేత (YCP Leader), మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Ex Minister Kakani Govardhan Reddy)ని సోమవారం ముత్తుకూరు పోలీసులు (Muthukur police) కస్టడీ (Custody)కి తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు (Krishna Patnam Port) వద్ద కంటైనర్ క్యారియర్ నుంచి అనధికారంగా టోల్ వసూళ్ల కేసు (Toll collection case)లో పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండు రోజుల పాటు విచారించనున్నారు. గతంలో మరో రెండు కేసుల్లో కాకాణిని అయిదు రోజులు పాటు పోలీసులు, సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణకు కాకాణి సహాకరించలేదు. ప్రస్తుతం రెండు రోజుల విచారణలో కాకాణి ఎంత వరకు సహాకరిస్తారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా అనధికార టోల్ గేట్ల ఏర్పాటు కేసులో కాకాణి ఏ1 ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే.


అనధికారంగా టోల్ గేట్ ఏర్పాటు..

అయితే గత ప్రభుత్వ హయాంలో కాకాణి తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అనధికారంగా టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రధానంగా కంటైనర్ క్యారియర్ వాహనాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఒక్కో వాహనం నుంచి రూ. 10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని విచారణలో తేలింది. దీనికి సంబంధించి ముత్తుకూరు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇలా వసూలు చేసిన డబ్బులు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయి.. తదితర వాటిపై పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కస్టడీ కోరగా రైల్వే కోర్టు రెండు రోజుల పాటు కాకాణీని కస్టడీకి అనుమతించింది. దీంతో పోలీసులు సేకరించిన ఆధారాలు చూపించి కాకాణీని ప్రశ్నించనున్నారు.


ఇవి కూడా చదవండి:

త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..

మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 30 , 2025 | 10:18 AM