Share News

CM Chandra Babu: జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు

ABN , Publish Date - Aug 11 , 2025 | 09:21 PM

స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని తెలిపారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత,రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదని ధీమా వ్యక్తం చేశారు.

CM Chandra Babu: జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు.. స్వాతంత్య్రానికి ప్రతీక : చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండా అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ.. ఇంటిపైన జాతీయ జెండా ఉండాలని ఆయన సూచించారు. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ జెండా చూస్తే గుర్తు తెచ్చుకోవాల్సిన వ్యక్తి దాని రూపొందించిన పింగళి వెంకయ్య అని తెలిపారు. జెండా కేవలం వస్త్రమే కాదు... స్వాతంత్య్రానికి ప్రతీక అని ఆయన వివరించారు.


ఎవరి ముందు భారతదేశం తలవంచదు..

స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని చంద్రబాబు గుర్తు చేశారు. దేశ సమగ్రత, భద్రత విషయంలో పటిష్టంగా ఉన్నామన్న విషయం ప్రపంచానికి చాటామని తెలిపారు. దేశ భద్రత, సమగ్రత, సార్వభౌమత, రక్షణ విషయంలో ఎవరి ముందు భారతదేశం తలవంచదని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడున్నది బలమైన, దృఢమైన భారతదేశమని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయిందని చెప్పుకొచ్చారు. మనం ఎవరి జోలికి వెళ్లం.. ఎవరైనా మన జోలికి వస్తే ఊరుకోమనేది.. ఆపరేషన్ సింధూర ద్వారా తెలియజేశామని స్పష్టం చేశారు.


మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్..

మనల్ని కాపాడే సైనికులకు ఎప్పుడు సెల్యూట్ చేయాలని చంద్రబాబు సూచించారు. భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా అవతరిస్తుందని అన్నారు. 2028 కల్లా భారతదేశం ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా డెడ్ ఎకానమీ అని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎవరిది డెడ్ ఎకానమియో భవిష్యత్తులో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. భారత దేశం లేకపోతే కొన్ని దేశాలు అభివృద్ధికి నోచుకోవని ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం అత్యున్నతమైనదని చంద్రబాబు కితాబిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పులివెందులలో ఎన్నికల వేళ.. వైసీపీకి హైకోర్టు షాక్

సిగ్గు చేటు జగన్: హోమ్ మంత్రి అనిత

Updated Date - Aug 11 , 2025 | 09:22 PM