AP Liquor Scam: లిక్కర్ కేసులో లోతైన విచారణ అవసరం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 09:58 PM
CID వేసిన పిటీషన్‌పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.
అమరావతి: ఏపీ లిక్కర్ కేసులో ఇవాళ(గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. CID పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితులు బయటఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో CID పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.
CID వేసిన పిటిషన్‌పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది. ఇది పూర్తిగా న్యాయ సంబంధమైన వ్యవహారం అని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు విచారణను ఈనెల 17కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం