Share News

Crime News: నంద్యాల జిల్లా, కంపమలలో భగ్గుమన్న పాత కక్షలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:14 AM

తెలుగుదేశం, వైసీపీ వర్గాల మధ్య పాత కక్షలు, పొలం తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇరు వర్గాలకు చెందిన వారు కత్తులతో దాడులు చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

 Crime News: నంద్యాల జిల్లా, కంపమలలో భగ్గుమన్న పాత కక్షలు
Crime News

నంద్యాల జిల్లా: కంపమల గ్రామంలో (Kampamala Village) పాత కక్షలు (Kampamala Village) భగ్గుమన్నాయి. తెలుగుదేశం (TDP), వైసీపీ (YCP) వర్గాలు కత్తులతో దాడులు చేసుకున్నారు. పరస్పర దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టీడీపీ,ర వైసీపీ వర్గాల దాడులతో కంపమల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

ఈ రెండు వర్గాల మధ్య పాత కక్షలు, పొలం తగాదాలు ఉన్నాయి. తీవ్రంగా గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. రెండు వర్గాలను ఉద్దేశించి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Also Read..:

చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..


విశాఖ, గాజువాక కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న టిప్పర్.. బైకును ఢీ కొంది. ఈ ఘటనలో వైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


పల్నాడు జిల్లా: ముప్పాళ్ళ మండలం గోళ్లపాడులో చోరీ జరగింది. ఇంటి తాళం పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 9 సవర్ల బంగారం, కిలో వెండి వస్తువులు పట్టుకుపోయారు. బాధితురాలు నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. సత్తెనపల్లి మండలం, దీపాలదిన్నేపాలెంలో భర్త గంగరామ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య , మామ, బావమరిదిలపై గొడ్డలితో దాడి చేశాడు. కుటుంబ కలహల నేపథ్యంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మామ గంగయ్య(55) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..

తిరుపతి జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు..

For More AP News and Telugu News

Updated Date - Mar 13 , 2025 | 10:14 AM