Crime News; చిన్న వివాదం.. యువకులు దాడి.. వృద్ధుడు మృతి..
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:49 AM
హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. చిన్న వివాదం విషాదంగా మారింది.కొంత మంది యవకులు జకీర్ ఖాన్ (62)పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

హైదరాబాద్: ఓల్డ్ సిటీ (Old City)లో చిన్న వివాదం విషాదంగా మారింది. అక్కడ యువకులు దాడి (Youths Attack) చేయడంతో 62 ఏళ్ల షాపు యజమాని ప్రాణాలు Death) కోల్పోయాడు. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన చిన్న సమస్యలపై పెరుగుతున్న హింసపై తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది. బాధితుడు జకీర్ ఖాన్ (62) (Zakir Khan) హఫీజ్ బాబా నగర్‌లోని సి బ్లాక్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. అతని దుకాణం ముందు కుర్చీలు వేయడంపై వివాదం తలెత్తింది. దీనిపై పక్కనే ఉన్న పాన్ షాపు యజమానితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పాన్ షాపుకు చెందినవారు జకీర్ ఖాన్‌పై దాడికి పాల్పడ్డారు.
Also Read..:
సభలో పట్టాదారు పాసు పుస్తకం సవరణ బిల్లు..
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాకీర్ ఖాన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న కంచన్‌బాగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి. పోలీసులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. చిన్న చిన్న వివాదాలకు కూడా దాడులకు పాల్పడడంతో ప్రాణాలు పోతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతి జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు..
మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్..
For More AP News and Telugu News