Share News

Tirupati తొక్కిసలాట ఘటన.. విచారణకు రావాలంటూ కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు

ABN , Publish Date - Mar 13 , 2025 | 07:36 AM

తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాణమూర్తి మూడో దశ విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న విచారణకు రావాలంటూ జిల్లా కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు జారీ చేశారు.

Tirupati తొక్కిసలాట ఘటన.. విచారణకు రావాలంటూ కలెక్టర్, టీటీడీ ఈవో, ఎస్పీకి సమన్లు
Tirumala Stampede

తిరుపతి: వైకుంఠ ఏకాదశి టోకెన్ల (Vaikunta Ekadashi Tokens)జారీ తొక్కిసలాట (Stampede)నేపథ్యంలో మూడో దశ విచారణలో భాగంగా ఈనెల 14, 15, 16 తేదీల్లో న్యాయ విచారణ కమిషన్ జస్టిస్ సత్యనారాయ ణమూర్తి (Justice Satyanarayana Murthy) తిరుమల (Tirumala)లో క్యూ లైన్ల నిర్వహణను కూడా పరిశీంచనున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి తిరుపతిలో జరగనున్న విచారణకు నేరుగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ (Collector Venkateswar), టీటీడీ ఈవో శ్యామల రావు (TTD EO Shyamala Rao), ఎస్పీ హర్షవర్ధన్‌రాజు (SP Harshavardhan Raju)కు ఇప్పటికే సమన్లు (Notices) జారీ చేశారు.

Also Read..:

రోజూ క్యాబేజీ తినడంవల్ల ప్రయోజనాలు..


కాగా వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సోమవారం (ఫిబ్రవరి 24వ తేదీ) విజయవాడ నుంచి వర్చువల్‌ విధానంలో జస్టిస్‌ సత్యనారాయణమూర్తి బాధితులను విచారించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి కలెక్టరేట్‌ వేదికగా కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాణమూర్తి శనివారం (ఫిబ్రవరి 22వ తేదీ)రెండో దశ విచారణ చేపట్టారు. 11 మందిని విచారించారు. ఇదే ఘటనలో విశాఖకు చెందిన కొందరు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణకు హాజరు కావాలని ఈ ప్రాంతానికి చెందిన 19 మంది బాధితులకు న్యాయవిచారణ కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. అయితే తామింకా కోలుకోలేదని గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని, అంత దూరం రాలేమని వర్చువల్‌ (జూమ్‌) మీటింగ్‌లో పాల్గొని ఘటపై వివరిస్తామని వారు కమిషన్‌కు లిఖితపూర్వకంగా వివరణ పంపించారు. దీంతో జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఆదివారం (ఫిబ్రవరి 23వ తేదీ) ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం వైజాగ్‌ గోపాలపట్టణం తహసీల్దారు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో న్యాయవిచారణ కమిషన్‌ ఎదుట బాధితులు హాజరయ్యారు. విజయవాడ నుంచి వర్చువల్‌ విధానంలో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ సత్యనారాయణమూర్తి వారిని విచారించారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిలో కొందరు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నారు. వీరూ వర్చువల్‌ విధానంలో విచారణకు హాజరు అయ్యారు. దీని తర్వాత మూడో దశ విచారణ ఈనెల 17వ తేదీ నుంచి తిరుపతిలో జరగనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

యువత కాదు వృద్ధుల పోరు..

మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్..

For More AP News and Telugu News

Updated Date - Mar 13 , 2025 | 07:41 AM