PM Modi, Lokesh: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:28 PM
కర్నూల్‌లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు.
అమరావతి: కర్నూలు విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ను చూపించి పరిచయం చేస్తూ.. సీఎం చంద్రబాబు నవ్వారు. మంత్రి లోకేశ్‌ను చూసిన మోదీ ఆశ్చర్యంగా ఉందన్నారు. లోకేశ్ చాలా బరువు తగ్గి పోయావు అంటూ.. మోదీ చమత్కారంగా మాట్లాడారు. త్వరలో మీ నాన్నలా తయారవుతావ్ అన్న మాట అని, లోకేశ్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ.. నవ్వారు. ప్రధాని కామెంట్స్‌కు చంద్రబాబు, లోకేశ్ చిరునవ్వులు చిందించారు. అనంతరం లోకేశ్‌ను గుడ్ అంటూ.. భుజం తడుతూ ప్రధాని మోదీ ముందుకు సాగారు.
కర్నూల్‌లోని ఓర్వకల్లు విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఏపీ పర్యటనలో ఉన్న ప్రధాని ప్రస్తుతం.. శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని మోదీ దర్శించుకోనున్నారు. సుమారు 50 నిమిషాల పాటు భ్రమరాంబ మల్లికార్జున స్వామి సేవలో గడపనున్నారు. తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. సుమారు 40 నిమిషాల పాటు శివాజీ స్పూర్తి కేంద్రం ద్యాన మందిరంలో మోదీ గడుపుతారు. అనంతరం 1.30 గంటలకు శ్రీశైలం నుంచి బయలుదేరి కర్నూలు బహిరంగ సభకి బయలుదేరి వెళ్తారు.
ఇవి కూడా చదవండి..
Transgenders Hospitalized in Delhi: ఫినాయిల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు
The Central Government Informed: రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి