Share News

Minister TG Bharath: కూటమి ప్రభుత్వంలో శరవేగంగా కర్నూలు జిల్లా అభివృద్ధి

ABN , Publish Date - May 18 , 2025 | 02:31 PM

Minister TG Bharath: రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 33 వార్డులను టీడీపీ కైవసం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తన పని తీరును మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల మంత్రి పదవి ఇచ్చారని మంత్రి టీజీ భరత్ గుర్తుచేశారు.

Minister TG Bharath: కూటమి ప్రభుత్వంలో శరవేగంగా కర్నూలు జిల్లా అభివృద్ధి
Minister TG Bharath

కర్నూలు: కూటమి ప్రభుత్వంలో శరవేగంగా కర్నూలు జిల్లా (Kurnool District) అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండుసార్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలులో ఇవాళ(ఆదివారం) కర్నూలు నియోజకవర్గంలోని ఓ హోటల్‌లో మినీ మహానాడు జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓర్పు అవసరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. 2019 ఎన్నికల ముందు ఓ నాయకుడిని మంత్రి నారా లోకేష్ అభ్యర్థిగా ప్రకటించారని... అయినప్పటికీ ఓర్పుగా ఉన్నానని... చివరకు తనకే టికెట్ వచ్చిందని మంత్రి టీజీ భరత్ గుర్తుచేశారు.


Bharat.jpg

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 33 వార్డులను టీడీపీ కైవసం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడే వారికే కార్పొరేటర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. తన పని తీరును మెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమల మంత్రి పదవి ఇచ్చారని గుర్తుచేశారు. మాది పొలిటికల్ గవర్నెన్స్ అని తెలిపారు. సీ.క్యాంప్ రైతుబజార్ విస్తరణకు, అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.6కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఓర్వకల్లులో రూ.1000 కోట్లతో సెమీకండక్టర్, మరో రూ.1000 కోట్లతో ఈవీ వెహికిల్ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. గతంలో ఓర్వకల్లులో భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇచ్చామన్నారు. అనంతపురం నుంచి ఓర్వకల్లు వరకూ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. కర్నూలులో ఉన్న బీసీ భవన్ పిల్లర్ల దశలోనే ఆగిపోయిందని చెప్పారు. కోటి రూపాయలతో పనులు పున:ప్రారంభం చేస్తామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Nara Lokesh: ఏపీకి మీ ఆశీస్సులు అందించండి

Governor Abdul Nazir: ప్రపంచ ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ

For More AP News and Telugu News

Updated Date - May 18 , 2025 | 02:44 PM