Share News

AP GOVT: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు

ABN , Publish Date - Feb 02 , 2025 | 07:38 PM

Minister NMD Farooq: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

AP GOVT: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు.. ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు
Minister NMD Farooq

నంద్యాల : కూటమి ప్రభుత్వం త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టిందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న హైకోర్టు జడ్జిల బృందం కర్నూలుకు వస్తున్నారని అన్నారు. కర్నూలు దిన్నె దేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనుందని తెలిపారు. బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు.


కాగా.. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం స్థలం, వసతుల అధ్యయనం చేయాలని అధికారులకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అదేశాలు జారీ చేశారు. హైకోర్టుకు కావాల్సిన స్థలం కోసం వసతుల అధ్యయనం చేశారు. అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అనంతరం జిల్లా కలెక్టర్‌కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అయితే శ్రీ బాగ్‌ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది.


గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. కర్నూలులో ‘హైకోర్టు బెంచ్‌’ ఏర్పాటు చేస్తాం అంటూ ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో (AP Assembly) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కూడా కర్నూలులో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి

Nagababu: నువ్వు అడవి దొంగ.. పెద్దిరెడ్డి బండారం బయటపెట్టిన నాగబాబు

Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...

Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం

Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 02 , 2025 | 07:40 PM