Deputy CM Pawan Kalyan: కర్నూల్ బస్సు ప్రమాదం కలచివేసింది..
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:36 AM
ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.
అమరావతి: కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బస్సులోనే చాలామంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం తరఫున సూచించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలుగా భద్రతా ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైంది. ఓ బైక్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అవి అంతకంతకూ పెరిగి బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బస్సులోనే పలువురు ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. మరికొందరు మంటలను చూసిన వెంటనే అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. బైకు బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఇవి కూడా చదవండి..
Election Commission: సర్‌కు సన్నాహాలు చేయండి
Chennai: నాన్నే నేరస్తుడని నమ్మించేలా అమ్మను చంపేశాడు