AP Government: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ముందడుగు
ABN , Publish Date - Jan 30 , 2025 | 07:37 PM
AP Government: ప్రజాగళం సందర్భంగా ‘కర్నూలులో హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది.
కర్నూలు : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, వసతుల అధ్యయనం చేయాలని అధికారులకు కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా అదేశాలు జారీ చేశారు. హైకోర్టుకు కావాల్సిన స్థలం కోసం వసతుల అధ్యయనం చేశారు. అన్ని వసతులు ఉండే స్థలం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అనంతరం జిల్లా కలెక్టర్‌కు అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.
కాగా.. శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. స్వాతంత్ర్యానికి పూర్వమే 1937 నుంచి సీమ ప్రజల హృదయాల్లో ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా స్వప్నంగానే మిగిలిపోయింది. కర్నూలులో ‘హైకోర్టు బెంచ్’ ఏర్పాటు చేస్తాం అంటూ ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే కసరత్తు ప్రారంభించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కూటమి ప్రభుత్వం లేఖ రాసింది. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో (AP Assembly) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కూడా కర్నూలులో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News