YS Sharmila: కాంగ్రెస్ నేతలకు షర్మిల పిలుపు.. రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యలు..
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:34 PM
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది.
ఎన్టీఆర్: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని APCC చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా మన వంతు సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయంలో నాయకులు ముందు నిలవాలన్నారు. ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు అందరూ.. ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవాలని షర్మిల విజ్ఞప్తి చేశారు.
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. రహదారులపై నీరు చేరడంతో.. చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీలకు వరద నీరుతో జలదిగ్బంధం అయ్యాయి. మరోవైపు తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Election Commission Announced: తమిళనాడు, బెంగాల్‌లో ఎస్‌ఐఆర్
Money View App: 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు..!