YS Sharmila: అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి..
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:59 PM
అంగన్‌వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.

విజయవాడ: అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు ( Anganwadi) న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం (Kutami Government) ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మాట తప్పి మోసం చేయడం అంటే ఇదేనని.. తమ గోడు వినిపించాలనుకున్న అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. వారి గొంతు నొక్కి, ఆందోళలను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంత చేష్టలకు పరాకాష్ట అని అన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని.. వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read..:
అంగన్వాడీలకు నెలకు గౌరవ వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, తక్షణం గ్రాట్యూటి చెల్లింపు హామీని అమలు చేయాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలని, హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని.. విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కింద రూ. 20 వేలు ఇవ్వాలన్నారు. వీటితో పాటు ఇతర 12 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేయాలని.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని వైఎస్ షర్మిల అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసివాళ్ల ప్రాణం.. అరుదైన వ్యాధి..
ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..
మా తడాఖా చూపిస్తా..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
For More AP News and Telugu News