Share News

Crime News: ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:24 PM

గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయిన చంద్రశేఖర్ రెడ్డి.. తరువాత ప్రైవేట్ కాలేజీలో లేచ్చరర్‌‌గా ఉద్యోగం చేశారు. ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో తమ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి.. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Crime News: ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..
Hyderabad shocking incident

హైదరాబాద్: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపిన (Murder Suicide Case) తర్వాత ఆ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. ఈ ఘటనపై వారి బంధువులు సోమవారం రాత్రి ఫోన్ చేసి సమాచారo అందించారని ఓయూ పోలీస్ స్టేషన్ (OU Police Station) సీఐ రాజేందర్ (CI Rajendar) తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ సమాచారం అందుకుని ఇంటికి వెళ్లి చూడగా నలుగురు మృతి చెంది ఉన్నారని, అనుమానస్పద మృతులుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులే చంద్రశేఖర్ రెడ్డి , కుటుంబ సభ్యుల ఆత్మహత్యకు కారణమని, ఇద్దరు పిల్లలను హ్యాంగ్ చేసి వారు చనిపోయిన తరువాత భార్య భర్తలు హ్యాంగ్ చేసుకున్నారని ఆయన తెలిపారు.

Also Read..:

మా తడాఖా చూపిస్తా..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి


ఫైనాన్షియల్‌గా వారి కుటుంబాలు వెల్ సెటిల్డ్..

గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నష్టపోయిన చంద్రశేఖర్ రెడ్డి.. తరువాత ప్రైవేట్ కాలేజీలో లేచ్చరర్‌ గా ఉద్యోగం చేశారు. ఆరు నెలల క్రితం ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూస్తే ఫైనన్సియల్‌గా వెల్ సెటిల్డ్ అని, రూ. 5 లక్షలు కావాలంటూ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగారని, వారు ఇస్తామని చెప్పారని.. భార్య కవిత ఆర్థిక ఇబ్బందులు గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పలేదన్నారు. భార్య భర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని, సూసైడ్ నోట్‌లో ఆర్ధిక ఇబ్బందులే కారణమని ఉందన్నారు. కవిత తల్లిదండ్రులు, చంద్రశేఖర్ తల్లి దండ్రుల నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశామన్నారు.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు ..

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని సీఐ రాజేందర్ తెలిపారు. గతంలో కుటుంబ సభ్యులకు అప్పులు ఉన్నాయని చెప్పారు కానీ ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది ఎవరి దగ్గర ఎంత మొత్తంలో అప్పులు చేసింది తదితర వివరాలు వారి తల్లి దండ్రులకు, బంధువులకు చెప్పలేదని.. దర్యాప్తులో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్‌లు సేకరిస్తున్నామన్నారు.


పిల్లలకు విషమిచ్చి చంపి.. ఉరేసుకొని దంపతుల ఆత్మహత్య

ఆరు నెలలుగా ఖాళీగా ఉండటం.. కుటుంబ పోషణకూ ఇబ్బందులు ఎదురవడంతో ఆ ఇంటిపెద్ద, భార్యా పిల్లలతో కలిసి చనిపోవాలనుకున్నాడు. ఇందుకు భార్యను ఒప్పించాడు. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపిన తర్వాత ఆ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హబ్సిగూడలో ఈ విషాదం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన కె.చంద్రశేఖర్‌రెడ్డి(40)కి భార్య కవిత(35), పిల్లలు శ్రీతా(15), విశ్వంత్‌(10) ఉన్నారు. కవిత గృహిణి. శ్రీతా తొమ్మిదో తరగతి, విశ్వంత్‌ ఐదో తరగతి చదువుతున్నారు. ఏడాదిగా ఈ కుటుంబం హబ్సిగూడలోని మహేశ్వరినగర్‌లో ఉంటోంది.. సోమవారం రాత్రి పిల్లలకు విషమిచ్చి చంపి.. చంద్రశేఖర్‌, కవిత ఆత్మహత్య చేసుకున్నారు. అతను రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హయగ్రీవ భూముల్లో ప్రభుత్వం బోర్డులు..

ఎరక్కపోయి ఇరుక్కున్న నేత..

విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

For More AP News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 12:25 PM