Share News

AP News:హయగ్రీవ భూముల్లో ప్రభుత్వం బోర్డులు..

ABN , Publish Date - Mar 11 , 2025 | 10:32 AM

హయగ్రీవ భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన సంస్థకు గుణపాఠం చెప్పింది.

AP News:హయగ్రీవ భూముల్లో ప్రభుత్వం బోర్డులు..
Hayagreeva lands government decision

విశాఖపట్నం: హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు (Hayagreeva Farms and Developers Company) కేటాయించిన భూముల (Lands)పై కూటమి ప్రభుత్వం (Kutami Government) సాహసోపేతమైన నిర్ణయం (Decision) తీసుకుంది. ఆ భూములను రద్దు చేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ (Collecor)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెవిన్యూ అధికారులు (Revenue officers) ఎండాడలో ఉన్న హయగ్రీవ భూముల్లో ప్రభుత్వ భూమిగా బోర్డులు వేశారు. భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ కూడా వేస్తున్నారు.

Also Read..:

ఎరక్కపోయి ఇరుక్కున్న నేత..


కాగా హయగ్రీవ భూములపై చంద్రబాబు ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు ఆశ్రమం నిర్మిస్తామని తక్కువ ధరకు ప్రభుత్వం నుంచి భూమి పొంది, అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన సంస్థకు గుణపాఠం చెప్పింది. హయగ్రీవ భూములను వెనక్కి తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘన, కోర్టుల తీర్పులు పరిగణనలోకి తీసుకొని అక్రమార్కులకు చెక్‌ పెట్టింది. విశాఖపట్నంలో చిలుకూరి జగదీశ్వరుడు అనే వ్యాపారి హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి వృద్ధులకు, అనాథలకు ఆశ్రమం నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, 12.51 ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకున్నారు. విశాఖ రూరల్‌ మండలం ఎండాడ సర్వే నంబరు 92/3లో 12.51 ఎకరాలను ఎకరా రూ.45 లక్షల చొప్పున ఆ సంస్థకు ఇచ్చారు. దీనిని మార్కెట్‌ రేటుగా జీవోలో పేర్కొన్నారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ 2012 జూలైలో విశాఖపట్నం వచ్చి మార్కెట్‌ విలువ తక్కువగా నిర్ణయించారని పేర్కొం టూ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అందులో నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వవద్దని వుడా, జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. దీనిపై హయగ్రీవ సంస్థ 2014లో హైకోర్టును ఆశ్రయించింది. నిరభ్యంతర ధ్రువపత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించాలని కోరింది. దీనిపై కలెక్టర్‌ స్పందించారు. భూమిని అంతవరకూ ఎందుకు ఉపయోగించుకోలేదో వివరణ ఇవ్వాలన్నారు. దాంతో సంస్థ మరో రిట్‌ పిటిషన్‌ వేసింది. ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొని నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది.

కలెక్టర్‌ 2015లో ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దాంతో మరోసారి సంస్థ కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకుంది. ఎన్‌ఓసీ కూడా ఇవ్వాలని ఉత్తర్వులు తెచ్చారు. 2018లో కలెక్టర్‌ ఎన్‌ఓసీ ఇచ్చారు. ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలని స్పష్టంచేశారు. దాంతో జగదీశ్వరుడు జీవీఎంసీకి, వుడాకు కాటేజీల నిర్మాణం కోసం 2019 ఫిబ్రవరిలో దరఖాస్తు చేశా రు. 2020 జూన్‌లో భూ వినియోగ మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమిని 2021లో రీ ఎలైన్‌మెంట్‌ చేయించారు. ఇవన్నీ పూర్తయ్యాక 2021 నవంబరు 17న రెరాలో రిజిస్టర్‌ చేశారు.


16 అగ్రిమెంట్లు.. 15 డీడ్లు

జీవీఎంసీ అధికారులకు నిర్మాణం కోసం హయగ్రీవ సంస్థ దరఖాస్తు చేయగా, వారు పరిశీలించి కొన్ని పత్రాలు లేవని, వాటిని సమర్పించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే 16 సేల్‌ అగ్రిమెంట్లు, 15 సేల్‌ డీడ్లు చేశారని గుర్తించి పనులు ఆపాలని(వర్క్‌ స్టాప్‌) 2022 మేలో ఒకసారి, జూలైలో ఒకసారి ఆర్డర్‌ ఇచ్చారు. కలెక్టర్‌ 2018లో ఎన్‌ఓసీ ఇచ్చి మూడేళ్లలో పూర్తి చేయాల్సిందిగా కోరినా ఇంకా పనులు కొనసాగించడం, బిట్లు బిట్లుగా అనుమతులు తీసుకోవడం, ఇచ్చిన భూమిలో 5.99 ఎకరాలు నిర్మాణానికి అందుబాటులో ఉన్నా పనులు చేపట్టకపోవడం వంటి ఉల్లంఘనలు అధికారులు గుర్తించారు. అలాగే 6.6 ఎకరాలను రెసిడెన్షియల్‌ కోసం మార్పు చేసిన విషయాన్ని గుర్తించారు. మొత్తం భూమిలో 54 శాతం, అందుబాటులో ఉన్న భూమిలో 90 శాతం విక్రయించినట్టు తేల్చారు. ఎన్‌ఓసీ ఇచ్చిన మూడేళ్ల తరువాత జీపీఏ తీసుకున్న వ్యక్తి వాస్తవాలను దాచిపెట్టి మళ్లీ జీవీఎంసీ నుంచి నిర్మాణానికి అనుమతులు కోరినట్టు గుర్తించారు. ఆర్‌సీసీ రూఫ్‌తో ఇండివిడ్యువల్‌ విల్లాల నిర్మాణాని కి దరఖాస్తు చేశారు. ఇది ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ నిబంధనలకు విరుద్ధం. పైగా దీనికి సమర్పించిన ప్లాన్‌లో డిజైన్లు వృద్ధులు, దివ్యాంగుల నివాసానికి అనుగుణంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.


ఇదికూడా నిబంధనల ఉల్లంఘనే అని తేల్చారు. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి వివరాలు సేకరించగా ‘హయగ్రీవ’లో మధ్యలో ఎండీగా చేరిన గద్దె బ్రహ్మా జీ దాదాపు 75 శాతం ఆస్తిని వివిధ వ్యక్తులకు విక్రయించినట్టు తేలింది.దానికి సంబంధించిన ఈసీలు బయటకు వచ్చాయి. వృద్ధుల పేరుతో తక్కువ ధర కు భూమి తీసుకొని వారికి ఆశ్రమం నిర్మించకుండా నే వాటిలో విల్లాలు, ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని, భూ కేటాయింపు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, జనసేన నాయకులు మూర్తి యాదవ్‌లు 2022లో హైకోర్టును ఆశ్రయించారు.

సమగ్రంగా పరిశీలించి నిర్ణయం

హయగ్రీవ అంశం కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. తనను మోసం చేశారని, ఆత్మహత్యే శరణ్యం అంటూ రెండే ళ్ల క్రితం భూమిని పొందిన వ్యక్తి(జగదీశ్వరుడు) సెల్ఫీ వీడియో విడుదల చేశారు. నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని ఆయనే డిమాండ్‌ చేశారు. నిబంధనల ప్రకారం పనులు చేయడం లేదని కలెక్ట ర్‌, జీవీఎంసీ అధికారులు అనేకసార్లు నివేదించారు. దాంతో ఈ కేసును కొత్త ప్రభుత్వం పరిశీలించింది. లోపాలు గుర్తించింది. భూమిని విక్రయించినప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే అంశం ఎక్కడా లేదని తేల్చారు. ఇచ్చిన 12.51 ఎకరాల్లో 5.99 ఎకరాలు రెసిడెన్షియల్‌గా మార్చినందున ఆ భూమిని వెనక్కి తీసుకోవచ్చునని జిల్లా కలెక్టర్‌.. సీసీఎల్‌ఏకు పంపిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నారు.

బీఎస్ఓ-24 ప్రకారం...

ఏ ప్రయోజనం కోసం ఇచ్చిన భూములు ఆ ప్రయోజనానికి వినియోగించాలని బీఎస్‌వో-24 స్పష్టం చేస్తోంది. లేదంటే వాటిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇదే విషయాన్ని పలు కేసుల్లో తీర్పులు ఇచ్చినప్పుడు ఉటంకించారు. వాటిని కూడా ప్రభుత్వం ఈ కేసులో పరిగణనలోకి తీసుకుంది. వారికి భూమి ఇచ్చినప్పటి జీవో 1447(2008 జూన్‌ 6) నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని తేల్చా రు. హయగ్రీవ భాగస్వాములు ప్లాట్లను విక్రయించినప్పుడు అది ప్రభుత్వ భూమిగానీ, అసైన్డ్‌ భూమిగానీ కాదని డాక్యుమెంట్లలో రాశారు. దానిని ప్రభుత్వం తప్పుపట్టింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఆ భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఉత్తర్వులు జారీచేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌.. రంగంలోకి రోబోలు..

విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

For More AP News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 10:32 AM