విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

ABN, Publish Date - Mar 11 , 2025 | 07:52 AM

అమరావతి: మాజీ ఎంపీ వియసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ అధిపతి కేవీ రావును బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో విజయసాయిపై కేసు నమోదైంది.

అమరావతి: మాజీ ఎంపీ వియసాయిరెడ్డి (Vijayasai Reddy)కి బిగ్ షాక్ (Big Shock) తగిలింది. కాకినాడ సీపోర్టు ప్రైవేటు లిమిటెడ్‌ (Kakinada Port Private Limited) అధిపతి కేవీ రావు (KV Rao)ను బెదిరించి అక్రమంగా వాటాలను తీసుకున్న కేసులో విజయసాయిపై కేసు (Case) నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఏపీ సీఐడీ (AP CID) అధికారులు నోటీసులు (Notice) జారీచేశారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. కేవీ రావు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ.. ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ-2గా చేర్చింది. ఇప్పటికే నాటి ఆడిటర్లను విచారించింది. ఈ కేసులో ఈడీ కూడా కొన్నాళ్ల కిందట విజయసాయిని విచారించిన విషయం తెలిసిందే.

Also Read..:

గ్రూప్‌-2 ర్యాంకింగ్‌ జాబితా విడుదల


ఈ వార్తలు కూడా చదవండి..

దళిత ద్రోహి జగన్

బడిలో విద్యార్థిని అనుమానాస్పద మృతి

For More AP News and Telugu News

Updated at - Mar 11 , 2025 | 07:53 AM