Share News

BJP:గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:21 AM

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని ఆయన అన్నారు.

BJP:గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
BJP MLA Rakesh Reddy

హైదరాబాద్: తెలంగాణ (Telangana) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో (Assembly Budget Session) మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో (Governor Speech) తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (BJP MLA Rakesh Reddy) అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. గడిచిన డిసెంబర్‌లో మొదటి సారి గవర్నర్ ప్రసంగంలోని అంశాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంగతి తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం తెచ్చే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై మాట్లాడాలన్నారు. అంతకు ముందు కాళేశ్వరం మీద అఖిల పక్షం టూర్ పెట్టారని.. ఇప్పుడు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని అన్నారు.

Also Read..:

హయగ్రీవ భూముల్లో ప్రభుత్వం బోర్డులు..


ఫామ్ హౌస్‌లో పడుకున్న వాళ్ళ గురించి తాము మాట్లాడమని (పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, విద్య, ఉద్యోగం, రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాలపై ప్రతి పక్ష పార్టీగా తామే మాట్లాడతామని అన్నారు. రాష్ట్రం విడిపోక ముందు రూ 800 కోట్లు ఉంటే 2014 తరువాత రూ. 5 వేల కోట్లకు కేటాయింపులు పెరిగాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక ఎన్ని వేల కోట్లు అప్పులు చేసారో సభలోనే చర్చిద్దామని అన్నారు.


బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

కాగా శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై సోమవారం తన చాంబర్‌లో పోలీసు, ఇంటెలిజెన్స్‌ అధికారులతో స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ బండా ప్రకాశ్‌, సీఎస్‌ శాంతికుమారి,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు సభ లోపల, వెలుపల శాంతియుత వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభకు సకాలంలో చేరుకొనేలా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు జరుగుతాయని, గతంలో మాదిరిగానే ఈ సమావేశాలకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని, సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో ముద్రించాలని అధికారులకు సూచించారు. శాసన మండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమష్టిగా పని చేయాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని సూచించారు. సభ సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎరక్కపోయి ఇరుక్కున్న నేత..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌.. రంగంలోకి రోబోలు..

విజయసాయి రెడ్డికి బిగ్ షాక్..

For More AP News and Telugu News

Updated Date - Mar 11 , 2025 | 11:21 AM