Train Theft at Vijayawada: ఏసీ బోగీలో చోరీ.. లక్షల విలువైన బంగారం మాయం
ABN , Publish Date - Aug 29 , 2025 | 08:28 AM
గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తాడు. మార్బుల్ పనికి వెళ్లే రెహ్మాన్‌కు చేతివాటం బాగా ఉంది.
» రైళ్లలో మార్బుల్ వర్కర్ చేతివాటం
» నిందితుడిని పట్టుకున్న రైల్వే పోలీసులు
»రూ.8 లక్షల ఆభరణాలు స్వాధీనం
» నిందితుడిపై పలు చోరీ కేసులు
విజయవాడ, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): గుంటూరుకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ (Abdul Rehman) భవానీపురంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. మార్బుల్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లుగా వ్యవహరిస్తాడు. మార్బుల్ పనికి వెళ్లే రెహ్మాన్‌కు చేతివాటం బాగా ఉంది. ఇంటి నుంచి పనికి వెళ్తున్నట్లు బయలుదేరిన రెహ్మాన్ నేరుగా విజయవాడ రైల్వేస్టేషన్‌కు (Vijayawada Railway Station) చేరుకుంటాడు. అక్కడ ప్లాట్ ఫాంలపై తిరుగుతూ వచ్చేపోయే రైళ్లలో ఏసీ బోగీలపై కన్నేస్తాడు. లోపలకు వెళ్లి పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే సెకన్ల వ్యవధిలో వస్తువులు మాయం చేస్తాడు.
సెల్ ఫోన్లతో మొదలై..
రెహ్మాన్ ఇంతకుముందు రైల్వేస్టేషన్ తిరుగుతూ సెల్ ఫోన్లను చోరీ చేసేవాడు. ఈ కేసుల్లో పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెహ్మాన్ టార్గెట్ మార్చుకున్నాడు. గుజరాత్‌కు చెందిన కొహీజం అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యక్రమానికి బయలుదేరారు. మొత్తం ఐదుగురు కుటుంబసభ్యులు ఈ నెల 15న గుజరాత్‌లో భగత్ కోఠి ఎక్స్‌ప్రెస్ ఏ1లో ఎక్కారు. రైలు 16న సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంది. అక్కడే ఉన్న రెహ్మాన్ ఏ1 బోగీలోకి ఎక్కాడు.
కొహీజం కుటుంబం నిద్రలో ఉండటంతో బెర్త్ కింద ఉన్న బ్యాగ్‌ను మాయం చేశాడు. తర్వాత చూసుకోగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో ఆయన టోల్ ఫ్రీ నంబరు 139కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం జీఆర్సీ పోలీసులకు అందింది. బాధితులు తిరిగి గుజరాత్ మార్గంలో 24న జీఆర్సీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు వెంటనే రంగంలో దిగి సీసీ పుటేజీలను పరిశీలించగా రైలు బోగీలోకి ఎక్కినట్టు కనిపించింది. బ్యాగ్ తీసుకుని రెండో ద్వారం వైపు దిగినట్టు కనిపించింది.
నిందితుడి కోసం పోలీసులు మొత్తం 104 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రెహ్మాన్, దోరీ చేసినట్టు గుర్తించారు. బ్యాగును ఇంటికి తీసుకెళ్లి భద్రంగా ఉంచి అవసరాల కోసం అందులో ఉన్న బంగారు ఉంగరం, గొలుసును తాకట్టు పెట్టాడు. వన్ టౌన్‌లో రెహ్మాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి మొత్తం రూ.10,61,318 బంగారు వస్తువులు, సెల్‌ఫోన్లు, ల్యాప్ టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.8లక్షల ఆభరణాలు కొహీజం కుటుంబానికి సంబంధించినవే. నిందితుడిపై ఇంతకుముందు సెల్‌ఫోన్ చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు..
ఏపీ ప్రభుత్వ స్టీల్‌ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...
For More AndhraPradesh News And Telugu News