Subabul Cultivation: సుబాబుల్ కర్రకు రికార్డు ధర.. టన్ను రూ.8వేలకు చేరువ
ABN , Publish Date - Aug 13 , 2025 | 07:48 AM
గత వైసీపీ పాలనలో సుబాబుల్ రైతులు నిలువు దోపిడీకి గురయ్యారు. మద్దతు ధరలో కనీసం నామమాత్రపు ధర కూడా రైతులకు అందలేదు. పదేళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వం సబాబుల్ కర్రకు రూ.4.800 మద్దతు ధర నిర్ణయించింది. కర్ర నరుకుడు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కలిపి టన్నుకు రూ.వెయ్యి వరకు ఖర్చులు పోను చేతికి నికరంగా రూ.3,000 తగ్గకుండా అందాయి.
సుబాబుల్ కర్రకు గిరాకీ!
టన్ను రూ .8 వేలు పలుకుతున్న సుబాబుల్
గత వైసీపీ ప్రభుత్వంలో రైతుల నిలువుదోపిడీ
ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో గిట్టుబాటు ధర
జిల్లాలో సుబాబుల్ కర్ర (Subabul Cultivation) రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. పేవరు కంపెనీల డిమాండ్‌కు తగినంతగా కర్ర సరఫరా లేనందున ధర బాగా పెరిగింది. ఖర్చులతో సబంధం లేకుండా టన్నుకు అధికంగా రైతు చేతికి రూ.6వేలు అందుతున్నాయి. మెట్ట ప్రాంతంలో వాణిజ్య పంటలతో నష్టపోతున్న రైతులు, కర్రకు మంచి ధర లభిస్తుండటంతో ప్రత్యామ్నాయంగా సుబాబుల్ తోటల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఈ ఏడాది సుబాబుల్ తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
(కంచికచర్ల- ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో సుబాబుల్ రైతులు నిలువు దోపిడీకి గురయ్యారు. మద్దతు ధరలో కనీసం నామమాత్రపు ధర కూడా రైతులకు అందలేదు. పదేళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వం సబాబుల్ కర్రకు రూ.4.800 మద్దతు ధర నిర్ణయించింది. కర్ర నరుకుడు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కలిపి టన్నుకు రూ.వెయ్యి వరకు ఖర్చులు పోను చేతికి నికరంగా రూ.3,000 తగ్గకుండా అందాయి. అలాంటిది వైసీపీ ప్రభుత్వ హయాంలో టన్నుకు. రూ.1500 కూడా గగనమైంది. ఐదేళ్లపాటు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పేపరు కంపెనీలు రైతులను పీల్చి పిప్పిచేశాయి. 2019 ఎన్నికలకు ముందు రూ. 5వేలకు తగ్గకుండా ధర ఇస్తామని వాగ్దానాలు చేసిన వైసీపీ నేతలు, అధికారంలోకి రాగానే పట్టించుకోక, గిట్టుబాటు ధర ఇప్పించటంలో పూర్తిగా విఫలమయ్యారు. గిట్టుబాటు ధర కోసం రైతుల ఆందోళన అరణ్య రోదనగా మారింది.తీవ్రంగా నష్టపోయిన పలుపురు రైతులు తోటలను తొలగించారు.
2014 నుంచి ధరలో వ్యత్యాసం..
2014 ఎన్నికల ముందు నుంచి సుబాబుల్ ధరలో కదలిక వచ్చింది. క్రమేణా ధర పుంజుకుంది. గత ఏడాది ఆగస్టులో రైతుల చేతికి నికరంగా రూ. 6 వేలు అందాయి. తర్వాత ధర కొద్దిగా దిగజారింది. ఒక దశలో రూ. వేలు మాత్రమే దక్కాయి. తిరిగి మార్కెట్లో ధర పేరుగుతోంది. పేవరు కంపెనీల అవసరాల (డిమాండ్)కు తగినంతగా ముడిపదార్ధమైన సుబాబుల్ కర్ర దొరకటం (సరఫరా) లేదని రైతు నేతలు చెపుతున్నారు. ఒకవైపు తోటల విస్తీర్ణం తగ్గటం, మరోవైపు వర్షాకాలం కావటం వల్ల తోటలు నరకటానికి వీలుపడటం లేదు. ప్రస్తుతం కర్ర సరఫరా బాగా తగ్గింది. గుత్తాదిపత్యంతో ధర విషయంలో పెత్తనం చెలాయించిన కంపెనీలు కర్ర కోసం పోటీపడుతూ ధర పెంచుతున్నాయి. రైతు చేతికి నికరంగా రూ. 6వేలు అందడం సుబాబుల్ చరిత్రలో రికార్డు. కూటమీ ప్రభుత్వంలో అత్యధిక ధర లభిస్తుండటంతో రైతులు సంతోషంతో ఉన్నారు. ఈ ధర ఇంకా పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు
ఈ ప్రాంతం నుంచి సుబాబుల్ కర్ర ఎస్‌పీఎం (సిర్పూర్ కాగజ్ నగర్), జేకే పేపర్ మిల్స్ (బలార్షా), ఏపీపీఎం (రాజమండ్రి), ఐటీసీ (భద్రాచలం) తదితర పేవరు మిల్లులకు సరఫరా అవుతుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల పర్యవేక్షణ లేనందున దాదాపుగా పేవరు కంపెనీలన్నీ దళారుల ద్వారా కర్ర కొనుగోలు చేస్తుండటం విశేషం. కొందరు దళారులు ఎకరాల వంతున తోటలను కాంట్రాక్టుకు తీసుకుంటున్నారు.ఇంకొందరు తోటల్లో కర్ర నరుకుడు, రవాణా ఖర్చులతో సంబంధం లేకుండా టన్ను రూ. 6వేల వంతున రైతులకు ఇస్తున్నారు.
పెరిగిన తోటల విస్తీర్ణం
ఈ ఏడాది సుబాబుల్ తోటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. జిల్లాలో నందిగాను, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో సుబాబుల్ తోటలు ఉన్నాయి. గతంలో లక్ష ఎకరాల్లో తోటలు ఉంటే, గిట్టుబాటు ధర లభించిక అధికశాతం రైతులు తోటలను తొలగించటంతో విస్తీర్ణం 50 వేల ఎకరాలకు తగ్గింది. ఒకవైపు వాణిజ్య పంటలు, అపరాల వల్ల నష్టపోతుండటం, మరోవైపు కర్రకు రికార్జుస్థాయిలో ధర లభిస్తుండటంతో రైతులు సుబాబుల్ తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. మరల తోటల విస్తీర్ణ లక్ష ఎకరాలకు చేరుతుందని చెపుతున్నారు. అయితే ఎకరం తోటలో 25 నుంచి 35 టన్నుల లోపు కర్ర దిగుబడి వస్తుంది. మూడు నుంచి నాలుగేళ్లలోపు తోట నరుకుడుకు వస్తుంది. ఏడాది నుంచి తోటలు విస్తీర్ణం పెరుగుతున్నందున రెండేళ్ల తర్వాత కర్ర పుష్కలంగా లభ్యం కానున్నది.
ఈ వార్తలు కూడా చదవండి..
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది: లోకేశ్
గెలిచి చరిత్ర సృష్టించబోతునున్నాం: పల్లా
For More AndhraPradesh News And Telugu News