YSRCP Rally: వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:49 AM
నందిగామలో వైసీపీ చేపట్టే ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఇవాళ(బుధవారం) ప్రజాపోరు నిర్వహించనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్‌లో ర్యాలీ తలపెట్టారు ఫ్యాన్ పార్టీ నేతలు. అయితే ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని నందిగామ పోలీసులు స్పష్టం చేశారు. నందిగామ సబ్-డివిజన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెక్షన్ 32 పోలీసు చట్టం, సెక్షన్ 163 BNSS, 2023 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ నిబంధనలని అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున నందిగామ టౌన్‌లో ప్రజల సమీకరణ చేయొద్దని స్పష్టం చేశారు. వైసీపీ ర్యాలీకి ప్రజలు ఎవరూ తరలి రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే తాము తీసుకునే చట్టపరమైన చర్యలకు గురవుతారని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ర్యాలీ కోసం ఉపయోగించే డీజేలు, ఇతర వాహనాలని స్వాధీనం చేసుకుంటామని నందిగామ పోలీసులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Read Latest AP News And Telugu News