Nandamuri Balakrishna: 27న విజయవాడలో ప్రత్యేక ఎగ్జిబిషన్.. ముఖ్య అతిథిగా బాలయ్య
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:16 AM
విజయవాడలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులకు కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు.
విజయవాడ , సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక ఎగ్జిబిషన్ (Vijayawada Exhibition) ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (Kesineni Sivanath) (చిన్ని) పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన ఏర్పాట్లపై నిర్వాహకులకు కేశినేని శివనాథ్ కీలక సూచనలు చేశారు. ఈ ఎగ్జిబిషన్‌కు ఎలాంటి భంగం కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఏలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలి: ఎంపీ కేశినేని శివనాథ్
గొల్లపూడి సమీపంలోని మైదానంలో తుది దశకు చేరుకున్న ఎగ్జిబిషన్ ఏర్పాట్లను ఇవాళ(గురువారం) స్వయంగా ఎంపీ కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు. ఎగ్జిబిషన్ స్టాళ్లు, విద్యుత్, భద్రత, పార్కింగ్, పబ్లిక్ సౌకర్యాలపై నిర్వాహకుల నుంచి ఎంపీ శివనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏర్పాట్లలో ఏలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన సూచనలు చేశారు. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఏర్పాట్లపై ఎంపీ కేశినేని శివనాథ్ చర్చించారు.
విజయవాడ ఎగ్జిబిషన్‌కు బాలకృష్ణ హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను కచ్చితంగా పాటించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడ ఎగ్జిబిషన్‌కు వచ్చే ప్రజలకు ఆకర్షణీయమైన సాంస్కృతిక, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడ ప్రజలకు ఎగ్జిబిషన్ ఓ విశేష అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో అన్ని విభాగాలను సమన్వయం చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేటి అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
లిక్కర్ స్కామ్‌లో మాజీ సీఎం కొడుకు అరెస్ట్..ఇక తర్వాత..
Read Latest AP News And Telugu News