High Alert In Machilipatnam: వైసీపీ ‘చలో మెడికల్ కాలేజ్’.. టెన్షన్ టెన్షన్
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:51 AM
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెడికల్ కాలేజ్‌కు వెళ్లి తీరుతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. దిమ్మల సెంటరు సమీపంలో సమీకరణ అవుతున్నారు వైసీపీ శ్రేణులు.
కృష్ణా జిల్లా, సెప్టెంబర్ 19: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 'చలో మెడికల్ కాలేజ్'కు వైసీపీ (YSRCP) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మచిలీపట్నంలో హైటెన్షన్ వాతావారణం నెలకొంది. నగరవ్యాప్తంగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. వైసీపీ చలో మెడికల్ కాలేజ్ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కాలేజ్ సమీప ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజ్‌కు వెళ్లే రోడ్డులోనూ పోలీసులు ఆంక్షలు విధించారు.
అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెడికల్ కాలేజ్‌కు వెళ్లి తీరుతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. దిమ్మల సెంటరు సమీపంలో సమీకరణ అవుతున్నారు వైసీపీ శ్రేణులు. ఈ నిరసనలో పాల్గొనేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ మచిలీపట్నంకు చేరుకున్నారు.
అటు ఏలూరులోనూ వైసీపీ చలో మెడికల్ కాలేజ్ పిలుపుకు లీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీ పిలుపుకు ధీటుగా టీడీపీ నేతలు చలో మెడికల్ కాలేజ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా రెండు పార్టీలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏలూరు పాతబస్టాండ్ వద్ద ఉన్న మెడికల్ కాలేజ్ టెంపరరీ భవనాల వద్ద భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ అసెంబ్లీ షెడ్యూల్ కుదింపు.. తాజా మార్పులు ఇవే
రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
Read Latest AP News And Telugu News