Perni Nani: వైసీపీకి బిగ్ షాక్.. కోర్టు సీరియస్.. మాజీ మంత్రికి అరెస్ట్ వారెంట్..
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:41 PM
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి పేర్నినానికి నూజివీడు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు విషయంలో పేర్నినానిపై న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించింది.

కృష్ణ జిల్లా(మచిలీపట్నం): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తెలుగుదేశం కార్యకర్త చందు, శ్రీహర్షలపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. విచారణకు రావాలని పలుమార్లు న్యాయస్థానం ఆదేశించినా.. కోర్టుకు రాకపోవడంతో పేర్ని నానిపై మచిలీపట్నం కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలని పోలీసులని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
షార్‌లో తీవ్రవాదులు ఉన్నారంటూ ఫోన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest AP News And Telugu News