Vamsi Case: వల్లభనేని వంశీ కోరికను అంగీకరించిన జైలు అధికారులు
ABN , Publish Date - Mar 10 , 2025 | 01:59 PM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
విజయవాడ: వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే (Former MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)ఉంటున్న బ్యారక్ (Barrack) మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌పై (Petition) సోమవారం న్యాయస్థానం (Court) విచారణ జరిపింది. దీనిపై ఇరువైపుల వాదోపవాదనలు జరిగాయి. ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్‌లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు (Jail officials) చెప్పారు. భద్రత రీత్యా బ్యారక్ మార్చలేమని కోర్టుకు తేల్చి చెప్పారు. అయితే మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరారు. ఆ కోరికను జైలు అధికారులు అంగీకరించారు. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు (SC, ST Court)లో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజుల సమయం కావాలని సత్యవర్ధన్ తరుపు న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణ న్యాయస్థానం వాయిదా వేసింది. అలాగే వల్లభనేని వంశీని మరోసారి విచేరించేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలంటు పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ వాయిదా వేసింది.
Also Read:
CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్‌పై బెదిరింపు కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) మరో పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో (Vijayawada SC, ST Court) పోలీసులు ఈ నెల 5న పిటిషన్ దాఖలు చేశారు. గతం వారం మూడు రోజుల కస్టడీలో వంశీ సహకరించలేదని పోలీసులు తెలిపారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదని, ఆధారాలతో అడిగినా స్పందించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. మరో పది రోజుల పాటు వంశీని కస్టడీకి ఇస్తే...ఈ కేసుకు సంబంధించి కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందని కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గతంలో కూడా పది రోజుల పాటు వంశీని కస్డడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయాధికారి కేవలం మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చారు. అయితే మూడు రోజుల కస్టడీలో కూడా పోలీసులకు వంశీ సహకరించని పరిస్థితి. ఏ ప్రశ్న వేసినా తెలీదు, మరిచిపోయాను అంటూ సమాధానాలు దాటవేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పట్లోనే మరోసారి వంశీని కస్టడీ కోరతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీని కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన పోలీసులు.. అందుకు కారణాలను కూడా న్యాయస్థానానికి తెలియజేశారు. ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్‌లు, ఇతర ముద్దాయిలను చూపించి పదే పదే ప్రశ్నించినప్పటికీ వంశీ నుంచి సరైన సమాచారం రాలేదని కోర్టుకు తెలిపారు.
అందువల్ల వంశీని మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో తెలిపారు. అంతేకాకుండా సత్యవర్థన్ కిడ్నాప్, బెదిరింపుల వ్యవహారం మొత్తం కూడా వంశీ కనుసన్నల్లోనే జరిగిందని, మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు సాక్షాలు సేకరించారు. ఈ క్రమంలో వంశీని మరోసారి కస్టడీకి ఇస్తే అన్ని రకాల ఆధారాలను సేకరించే అవకాశం ఉందని పిటిషన్‌లో తెలిపారు. ఈరోజు వంశీ కస్టడీపై విచారణ జరిపిన న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. కాగా వంశీని కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్షా..
ఎమ్మెల్సీ పదవిపై మాజీ ఎమ్మెల్యే ఏమన్నారంటే..
Read Latest Telangana News and National News