Share News

Flower Expo in AP: ఏపీలో ఫ్లవర్ ఎక్స్‌పో.. ఆకట్టుకుంటున్న ప్రత్యేక మొక్కల ప్రదర్శన

ABN , Publish Date - Dec 08 , 2025 | 01:13 PM

రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్‌పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు.

Flower Expo in AP:  ఏపీలో  ఫ్లవర్ ఎక్స్‌పో.. ఆకట్టుకుంటున్న  ప్రత్యేక మొక్కల ప్రదర్శన
Flower Expo in AP

విజయవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్‌పో (Flower Expo in AP) డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు. విజయవాడ వాసులు ఈ ఎక్స్‌పోను సందర్శించి తమకు కావాల్సిన మొక్కలను కొనుగోలు చేశారు. పలువురు అందమైన మొక్కలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. నాలుగు రోజుల పాటు నగర వాసులను అలరించింది ఈ ఫ్లవర్ ఫ్లవర్ ఎక్స్‌పో. ఈ ప్రదర్శనలో దేశా, విదేశాలకు చెందిన మొక్కలు ఎంతో స్పెషల్‌గా నిలిచాయి. బోన్సాయ్ మొక్కలు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


ఫ్లవర్ ఎక్స్‌పోలో 90 స్టాల్స్ ఏర్పాటు చేశాం: ఉషారాణి

ఈ మేరకు రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వాహకులు ఉషారాణి మీడియాతో మాట్లాడారు. సిద్ధార్థ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆవరణలో ఫ్లవర్ ఎక్స్‌పో ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 90 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. నగరవాసులు భారీ సంఖ్యలో ఫ్లవర్ ఎక్స్‌పోకు వచ్చారని తెలిపారు. మొక్కలు, వాటిని పెంచటానికి అవసరమైన సామగ్రిని కూడా ఇక్కడ అమ్ముతున్నట్లు తెలిపారు.


ఫ్లవర్ ఎక్స్‌పో ఇతర దేశాల మొక్కల ప్రదర్శన: రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు పద్మశ్రీ

ఫ్లవర్ ఎక్స్‌పోలో వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన మొక్కల ప్రదర్శన జరిగిందని రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు పద్మశ్రీ తెలిపారు. ఈ రోజుతో ఈ ప్రదర్శన ముగుస్తుందని చెప్పుకొచ్చారు. ఫ్లవర్ ఎక్స్‌పోలో నగర వాసులు పలు రకాల మొక్కలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో ప్రధాన అనుచరుడు

ఎన్టీఆర్ సర్కిల్‌కు వాజ్‌పేయి పేరు.. టీడీపీ అభ్యంతరం

Read Latest AP News and National News

Updated Date - Dec 08 , 2025 | 01:24 PM