Share News

IG Ravikrishna: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఐజీ రవికృష్ణ

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:21 PM

డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ ఉద్ఘాటించారు. గంజాయి, ఏండీఏంఏ డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు.

IG Ravikrishna: డ్రగ్స్ ఫ్రీ ఏపీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఐజీ రవికృష్ణ
IG Ravikrishna

విజయవాడ: డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు, రవాణా చేసిన కఠినంగా శిక్షిస్తామని ఈగల్ చీఫ్ , ఐజీ రవికృష్ణ (IG Ravikrishna) హెచ్చరించారు. ఏపీలో డ్రగ్స్‌కు చోటు లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌ వెనుక ఎంతటి వారున్న ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(మంగళవారం) సిద్ధార్థ మెడికల్ కళాశాలలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఈగల్ చీఫ్, ఐజీ రవికృష్ణ, విజయవాడ డీసీపీ సరిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. గుంటూరులో జరిగే యాంటీ డ్రగ్స్ డే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారని తెలిపారు. ఈగల్ తరపున విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు, చట్టాలపై వారికి వివరించామని చెప్పారు ఐజీ రవికృష్ణ.


డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈగల్ అడుగులు వేస్తోందని ఐజీ రవికృష్ణ ఉద్ఘాటించారు. గంజాయి, ఏండీఏంఏ డ్రగ్స్ వాడుతున్న వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నామని అన్నారు. ఏండీఏంఏ డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడిన వారిలో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా 1972 కాల్ చేయాలని అన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు 45 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 7640 వరకు అవగాహన సద్సులు నిర్వహించామని తెలిపారు. మైగ్రేడ్ వర్కర్ల్‌ను కూడా కలిసి వారికి కూడా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. 34లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చి ఉంటున్నారని వెల్లడించారు ఐజీ రవికృష్ణ.


వారి రాష్ట్రాల నుంచి ఎవరైనా గంజాయి తెచ్చినా చర్యలు కఠినంగా ఉంటాయని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. ఏండీఏంఏ డ్రగ్స్ కూడా ఇటీవల పట్టుబడిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. బ్యాక్ వర్డ్ లింక్స్, ఫార్వార్డ్ లింక్స్ కూడా కనిపెట్టి పూర్తిగా నిరోధించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. మత్తు పదార్థాలు రవాణా చేస్తే ఏడాది పాటు జైలుకు వెళ్లక తప్పదనే విషయాలను వివరిస్తున్నామని చెప్పారు. యువత ఎక్కువుగా మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఏ విద్యార్ది డ్రగ్స్ బారిన పడినా.. అతనితో పాటు, ఆ కుటుంబం కూడా నష్టపోతుందని చెప్పారు. డ్రగ్స్ రవాణా చేస్తే భవిష్యత్‌లో వారి పాస్‌పోర్టు రద్దవుతుందని హెచ్చరించారు. ఈగల్ క్లబ్‌ల ద్వారా ప్రతి కాలేజీలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పర్యావసనాలను కూడా వారికి వివరిస్తున్నామని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి

జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు

ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 08:28 PM