Share News

CM Chandrababu.. ఫైళ్ల క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 11 , 2025 | 01:48 PM

ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నేదానిపైన కార్యద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు త్వరిత‌గ‌తిన ప‌రిష్కారం చేయాలన్నారు.

 CM Chandrababu.. ఫైళ్ల క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి : పేరుకు పోతున్న ఫైల్లు (Files), రెడ్ టేపీజం (Red Tape)పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సీరియస్ (Serious) అయ్యారు. ఫైళ్ల క్లియరెన్సులో మంత్రులు, అధికారులు వేగం పెర‌గాలని, ఆర్థికేతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండ‌కూడ‌దని, అధికారుల‌కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయం (Secretariat)లో మంత్రులు (Ministers), కార్యదర్శులతో కాన్ఫరెన్స్ (Conference with secretaries) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియ‌రెన్సు ప్రక్రియ వేగ‌వంతం చేయాలని, వివిధ శాఖ‌ల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియ‌రెన్సు జ‌రుగుతున్న క్రమం పై ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్రజెంటేష‌న్ ఇచ్చారు.

ఈ వార్త కూడా చదవండి..

నెల్లూరు జిల్లా కావలిలో భారీ మనీ స్కాం..


ప్రభుత్వ కార్యాల‌యాల్లో ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియ‌రెన్సులో వేగం పెర‌గాలని, ఫైళ్లు ఎక్కడికక్కడ క్లియ‌ర్ కాకుండా ఆగిపోతున్నాయ‌నేదానిపైన కార్యద‌ర్శులు, శాఖ‌ల విభాగాధిప‌తులు స‌మీక్ష చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆల‌స్యానికి గ‌ల కార‌ణాలు తెలుసుకుని వాటిని తొల‌గించి ఫైళ్లు త్వరిత‌గ‌తిన ప‌రిష్కారం చేయాలన్నారు. ఫైళ్లలో ఆర్థిక‌, ఆర్థికేత‌ర అనే రెండు ర‌కాల ఫైళ్లుంటాయని, ఆర్థికేత‌ర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి ప‌రిస్థితిలోనూ పెండింగ్‌లో ఉండ‌కూడ‌దన్నారు. ఆర్థిక ప‌ర‌మైన ఫైళ్లు అయితే ఆయా శాఖ‌ల్లోని బ‌డ్జెట్ త‌దిత‌ర అంశాల‌ను సమీక్షించుకుని ఫైళ్లను త్వరిత‌గ‌తిన స‌మీక్షించాలన్నారు. కొన్ని శాఖ‌ల్లో కొంత‌మంది అధికారులు త‌మ వ‌ద్ద ఫైళ్లను ఆరు నెల‌లు, ఏడాది వ‌ర‌కు ఉంచుకుంటున్నారని, ఇది స‌రైన ప‌ద్దతి కాదన్నారు. కొన్ని ప్రభుత్వ శాఖ‌ల్లో స‌గ‌టున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియ‌రెన్సు అవుతున్నాయని, మ‌రికొన్ని శాఖ‌ల్లో ఫైళ్లు ఆల‌స్య అవుతున్నాయ‌ని ఆర్టీజీఎస్ సీఈవో (RTGS CEO) దినేష్ కుమార్ వివరణ ఇచ్చారు.


కాగా గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తుచేశారు.

గుమ్మిడి సంధ్యారాణి..

యాక్ట్ 1/70 (Act 1/70) మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని, ఆదివాసి చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం (State Govt.) కట్టుబడి ఉందని, గిరిజనులు (Tribal s) ఆందోళన చెందవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి (Minister Gummidi Sandhyarani) అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు విషప్రచారం చేస్తూ.. అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 5 ఏళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారని, అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైఎస్సార్‌సీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండి కొట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చేతగకపోతే నోరు మూసుకుని కూర్చోండి.. మంత్రి పొన్నం

ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలి

తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..

కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 01:58 PM