నెల్లూరు జిల్లా కావలిలో భారీ మనీ స్కాం..
ABN , Publish Date - Feb 11 , 2025 | 01:03 PM
నెల్లూరు జిల్లా: కావలిలో భారీ మనీ స్కాం వెలుగు చూసింది. ప్రజల నుంచి రూ. 78 కోట్లు వసూలు చేసి మహబూబ్ సుభానీ అనే వ్యక్తి పరారయ్యాడు. కొందరు పోలీసులు అతనితో చేతులు కలిపి జనం నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులే ఏజెంట్లుగా వ్యవహరించారు.
నెల్లూరు జిల్లా: కావలి (Kavali)లో భారీ మనీ స్కాం (Money Scam) వెలుగు చూసింది. ప్రజల నుంచి రూ. 78 కోట్లు (Rs78 Crores) వసూలు చేసి మహబూబ్ సుభానీ (Mahaboob Subhani) అనే వ్యక్తి పరారయ్యాడు. ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి (MLA Kavya Krishna Reddy) చొరవతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు పెద్ద సంఖ్యలో బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ముసునూరులో సుభానీ ఏడాదిన్నర నుంచి అనంతర్థ అసోషియేట్స్ పేరుతో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కొందరు పోలీసులు అతనితో చేతులు కలిపి జనం నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులే ఏజెంట్లుగా వ్యవహరించారు. మొదట్లో ఇద్దరు తహసీల్దారులు, సీఐ, డీఎస్పీ ర్యాంక్ పోలీసు అధికారులు పెట్టుబడులు పెట్టి రూ. కోట్ల లో రాబట్టుకున్నారు. మహబూబ్ సుభానీ పరారైన విషయం తెలుసుకుని బాధితులు అనంతర్థ అసోషియేట్స్ కార్యాలయం వద్ద క్యూ కట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా క్లిక్ చేయండి..
ఈ పథకాన్ని సమర్ధవంతంగా వాడుకోవాలి
ఈ వార్తలు కూడా చదవండి..
చేతగకపోతే నోరు మూసుకుని కూర్చోండి.. మంత్రి పొన్నం
తెలంగాణ పర్యటనకు కాంగ్రెస్ అగ్రనేత..
కాంగ్రెస్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే..
4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News