Share News

High Court On Vaishnavi case: చిన్నారి వైష్టవి కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 03 , 2025 | 09:35 PM

విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసులో ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్లు వేశారు నిందితులు. అయితే, ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేసింది హైకోర్టు.

High Court On Vaishnavi case: చిన్నారి వైష్టవి కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం
AP High Court On Vaishnavi case

అమరావతి, నవంబరు3 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు (Vaishnavi case)లో ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు (AP High Court)లో పిటిషన్లు వేశారు నిందితులు. అయితే, ఈ కేసులో మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేసింది హైకోర్టు. నిందితులకి జీవిత ఖైదు విధింపును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించింది ధర్మాసనం.


ట్రైల్ కోర్టు వెంకట్రావుకు విధించిన జీవిత ఖైదును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 2010 జనవరి 30వ తేదీన ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి హత్య చేశారు నిందితులు. గుంటూరు ఆటోనగర్‌లో శారద ఇండ్రస్ట్రీలో విద్యుత్ కొలిమిలో మృతదేహాన్ని వేసి బూడిద చేశారు నిందితులు. కుమార్తె హత్య గురించి తెలిసి గుండెపోటుతో మరణించారు ప్రభాకర్. విచారణ అనంతరం 2018 జూన్ 14వ తేదీన ఈ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది విజయవాడ సెషన్స్ కోర్టు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు వేశారు నిందితులు.


ఈ వార్తలు కూడా చదవండి...

కృత్రిమ మేధస్సుతో అడవి ఏనుగుల సమస్య పరిష్కారం: పవన్ కల్యాణ్‌

వందేమాతరం 150 ఏళ్ల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 03 , 2025 | 09:42 PM