BAC Meeting AP: పదిరోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు... బీఏసీలో నిర్ణయం
ABN , Publish Date - Sep 18 , 2025 | 01:01 PM
సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 18: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30వరకు జరుగనున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈరోజు (గురువారం) స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన శానసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ అయ్యింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. సభలో చర్చించేందుకు 18 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించింది. నేడు జీఎస్టీపై సభలో చర్చించనున్నారు. కేంద్రప్రభుత్వం జీఎస్టీ స్లాబ్‌లు తగ్గించడం వల్ల ధరలు తగ్గడం, ప్రజలకు కలిగిన లాభంపై ఇవాళ సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రకటనపై పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు.
అలాగే రేపు (శుక్రవారం) జలవనరులపై సభలో చర్చ జరుగనుంది. 22న శాంతి భద్రతలు, 23న వైద్యారోగ్యం, 24న పరిశ్రమలు, 25న సూపర్6, 26న క్వాంటం, 27న లాజిస్టిక్స్, 29న స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30న రాయలసీమ- కోస్తా-ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించనున్నారు. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు. ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరపాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ సభలో మంత్రులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
సభలో చర్చించేందుకు 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
తొలిసారి మండలికి నాగబాబు.. పవన్ దిశానిర్దేశం
మండలిలో పోటాపోటీ నినాదాలు.. సభ వాయిదా
Read Latest AP News And Telugu News