AP Assembly News: మంత్రులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసహనం..
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:26 AM
ఈ మేరకు మంత్రులు, అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్, మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు మాట్లాడితే అధికారులు, మంత్రులు ఎవరు నోట్ చేసుకోకపోవడం ఏమిటని ఆయన నిలదీశారు. మరోవేపు జీరో అవర్‌లో లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా తమకు సమాధానం రావాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. దీంతో కాసేపు అసెంబ్లీ వాతావరణం హీట్ ఎక్కింది.
ఈ మేరకు మంత్రులు, అధికారులు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా స్పీకర్ ఆదేశించాలని ఎమ్మెల్యే బుచ్చయ్య పట్టుబట్టారు. దీనిపై వెంటనే స్పందించిన స్పీకర్, మంత్రులు వెంటనే సమాధానం చెప్పాలని ఆదేశాలు ఇచ్చారు. సభలోనే ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని కాసేపు సమయం ఇస్తే.. తాము నోట్ చేసుకుని సమాధానం చెబుతామని సభకు హామీ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు శాంతించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..