Paka Suresh: కడప మేయర్‌గా పాక సురేశ్ ఎన్నిక
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:19 PM
కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక గురువారం జరిగింది. ఈ ఎన్నికల్లో కడప మేయర్‌గా పాక సురేశ్ ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు.
కడప, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక (Kadapa Mayor Election) ఇవాళ(గురువారం) జరిగింది. ఈ ఎన్నికల్లో కడప మేయర్‌గా పాక సురేశ్ (Paka Suresh) ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో పాక సురేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వైసీపీ కార్పొరేటర్లు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది. మేయర్ అభ్యర్థిగా పాక సురేశ్ అభ్యర్థిత్వాన్ని వైసీపీ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, షఫీలు బలపరిచారు. దీంతో పాక సురేశ్ ఏకగ్రీవంగా మేయర్‌గా ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు.
అయితే, వైసీపీ పాలక వర్గంలోనే మేయర్ పదవి కోసం ముగ్గురు కార్పొరేటర్లు పోటీపడ్డారు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసేందుకు రంగంలోకి ఎంపీ అవినాశ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిలు దిగారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పోటీలో ఉన్న 47వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేశ్‌ను మేయర్‌గా ఎంపిక చేశారు.
ఈ ఎన్నికలో పాక సురేశ్‌ను అధికారికంగా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ప్రకటించారు. స్థానిక ఎన్నికలు, మేయర్ పదవీకాలం మూడు నెలలు గడువు మాత్రమే ఉండటంతో తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత కడప నగర మేయర్ సురేశ్ బాబు అవినీతి, అక్రమాలు వాస్తవమని తేలడంతో మేయర్ పదవిని తొలగించింది కూటమి ప్రభుత్వం.
కాగా, కడప నగరమేయర్ ఎన్నిక సందర్భంగా ఎన్నికల అధికారి జేసీ అతిథి సింగ్‌కు వైసీపీ అభ్యర్థి బీఫామ్, ఏ ఫాం, విప్ నోటీసు కాపీలను వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరూ కార్పొరేటర్ల ఏకాభిప్రాయంతోనే మేయర్ అభ్యర్థిని ఖరారు చేశామని తెలిపారు. ఎవరూ అసంతృప్తికి లోను కాలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నవారే కార్పొరేటర్లుగా ఉన్నారని స్పష్టం చేశారు.
ముద్దనూరు ఎంపీపీగా వెన్నపూస పుష్పాలత ఎన్నిక..
మరోవైపు... ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ఇవాళ(గురువారం) జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో కలసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు వైసీపీ ఎంపీటీసీలు. ఎంపీపీ ఎన్నికకు కూటమి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ, జనసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన వెన్నపూస పుష్పాలతను ఎంపీపీగా జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ ఎంపిక చేశారు. ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక సందర్భంగా కడప జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News