Raghurama: పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోండి.. డీవోపీటీకి రఘురామ లేఖ
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:45 PM
సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు సోమవారం లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు.
అమరావతి, డిసెంబరు1 (ఆంధ్రజ్యోతి): సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై డీవోపీటీ(DOPT) కార్యదర్శికి ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు (Raghurama Krishnama Raju) ఇవాళ(సోమవారం) లేఖ రాశారు. ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇటీవల సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి రఘురామ తీసుకెళ్లిన విషయం తెలిసిందే.
కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదేనని పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను డీవోపీటీ దృష్టికి తీసుకువచ్చారు రఘురామ. కాపులు సీఎంగా, దళితులు డిప్యూటీ సీఎంగా ఉండవచ్చని సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. సునీల్ కుమార్ సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ ఆయనకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు.
రాజకీయంగా కులాలను రెచ్చగొట్టే విధంగా సునీల్ కుమార్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. రాజ్యాంగ నిబంధనలకు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా పీవీ సునీల్ కుమార్ వ్యాఖ్యలు ఉన్నాయని.. వీటిని వెంటనే డీవోపీటీ పరిశీలించాలని కోరారు. ఈ వ్యాఖ్యల విషయంలో సునీల్ కుమార్‌ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని రఘురామ కృష్ణమరాజు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పింఛన్ల పంపిణీలో ఏపీదే అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్థం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News