Share News

PawanKalyan wishes Mohanlal: మోహన్‌లాల్ సుదీర్ఘ ప్రయాణానికి అద్భుత గౌరవం.. పవన్ కల్యాణ్ విషెస్

ABN , Publish Date - Sep 20 , 2025 | 09:21 PM

ప్రముఖ నటులు మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్‌‌‌కు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

 PawanKalyan wishes Mohanlal: మోహన్‌లాల్ సుదీర్ఘ ప్రయాణానికి అద్భుత గౌరవం.. పవన్ కల్యాణ్ విషెస్
PawanKalyan wishes Mohanlal

అమరావతి , సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సీనియర్ నటుడు మోహన్‌లాల్‌(Mohanlal) దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dadasaheb Phalke Award)కు ఎంపికయ్యారు. 2023వ సంవత్సరానికిగానూ మోహన్‌లాల్‌‌ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 23వ తేదీన మోహన్‌లాల్‌కు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. గతంలో మోహన్‌లాల్‌కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో దాసాహెబ్ ఫాల్కే అవార్డుకు మోహన్‌లాల్‌‌ ఎంపికవడంపై సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మోహన్‌లాల్‌‌‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (PawanKalyan) అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు పవన్ కల్యాణ్.


సహజత్వానికి ప్రాధాన్యం..

‘ప్రముఖ నటులు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం. ఈ సందర్భంగా మోహన్ లాల్‌కి హృదయపూర్వక అభినందనలు. అభినయంలో మోహన్ లాల్ సహజత్వానికి ప్రాధాన్యం ఇస్తారు. కథానాయకుడిగా  మోహన్ లాల్ విభిన్న పాత్రలు పోషించారు. ఐదు జాతీయ అవార్డులు సాధించారు. తెలుగులో ఆయన నటించినవి తక్కువేగానీ అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించారు. ఆయన నటించిన ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటివి తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయి. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలి’ అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 09:29 PM