Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ABN , Publish Date - Jan 25 , 2025 | 06:38 PM
Pawan Kalyan:అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఇష్యూపైఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. అనవసరమైన నష్టాల నుంచి వినియోగదారులను రక్షించేలా, న్యాయబద్దంగా ఉండేలా చూడాలని అమెజాన్ వంటి ఫ్లాట్ పారాలను కోరుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

అమరావతి: అమెజాన్ గిఫ్ట్ కార్డ్ వినియోగదారులు లేవనెత్తిన కొన్ని ఫిర్యాదులు ఆలస్యంగా తన దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అమెజాన్ వినియోగదారుల గడువు ముగిసిన బహుమతి కార్డ్ బ్యాలెన్స్ వారి ఖాతాల్లోకి పోతుందని గుర్తించామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. తన ఆఫీసు కూడా గడువు ముగిసిన బహుమతి కార్డ్‌ల నుంచి కోల్పోయిన బ్యాలెన్స్‌ల సమస్యను ఎదుర్కొందని చెప్పారు. చాలా మంది వినియోగదారులు కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా నష్టపోతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.
295 మిలియన్లకు పైగా భారతీయులు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను చురుకుగా ఉపయోగిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. 1 బిలియన్+ గిఫ్ట్ కార్డ్‌లు అమెజాన్ ఇండియాలోనే కొనుగోలు చేయబడ్డాయన్నారు. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలపై RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని PPIలు తప్పనిసరిగా కనీసం ఒక సంవత్సరం చెల్లుబాటును కలిగి ఉండాలని పవన్ కల్యాణ్ తెలిపారు. ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్నట్లయితే, ఖాతాను ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే డియాక్టివేట్ చేయాలని చెప్పారు. బ్యాలెన్స్ మూలానికి తిరిగి చెల్లించబడుతుంది లేదా KYC-లింక్డ్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుందని అన్నారు. అనవసరమైన నష్టాల నుంచి వినియోగదారులను రక్షించేలా, న్యాయబద్దంగా ఉండేలా చూడాలని అమెజాన్ వంటి ఫ్లాట్ పారాలను కోరుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..