Nara Lokesh Meets Airbus Board: ఎయిర్‌బస్ బోర్డుతో మంత్రి లోకేశ్ కీలక భేటీ...
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:39 PM
మేకిన్ ఇండియా ఆమలుకు తొలిసారి ఢిల్లీలో ఎయిర్‌బస్ బోర్డుతో సమావేశం అయినట్లు లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీకి రావాలని ఎయిర్‌బస్ ప్రతినిధులను ఆహ్వానం పలికారు.
ఢిల్లీ: రాజధాని పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్, ఎయిర్‌బస్ బోర్డుతో కీలక భేటీ అయ్యారు. ఎయిర్‌బస్‌కు ఏపీ గోల్డ్ స్టాండర్డ్ వేదికని వారికి తెలిపారు. ఏపీలో ఏరోస్పేస్ తయారీ కేంద్రానికి మంత్రి లోకేశ్ ప్రతిపాదన చేశారు. ఏపీలో వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో ఫెసిలిటేషన్‌కు ఆయన హామీ ఇచ్చారు. రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వివరించారు. నైపుణ్యంతో కూడిన టాలెంట్, స్కిల్లింగ్‌లో భాగస్వామ్యాలు కావాలని లోకేశ్ పేర్కొన్నారు.
మేకిన్ ఇండియా ఆమలుకు తొలిసారి ఢిల్లీలో ఎయిర్‌బస్ బోర్డుతో సమావేశం అయినట్లు లోకేశ్ తెలిపారు. ఏపీకి రావాలని ఎయిర్‌బస్ ప్రతినిధులను ఆహ్వానం పలికినట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనువైన భూమి ఏపీలో ఉందని స్పష్టం చేశారు. ప్రొగ్రెసివ్ ఏరోస్పేస్ పాలసీ, ప్రోత్సాహకాలు ఉంటాయని వివరించారు. మల్టీపుల్ ఏరోస్పేస్ కారిడార్, పోర్టులతో అనుసంధానంపై బోర్డు సభ్యులకు లోకేశ్ వివరణ ఇచ్చారు. ప్రఖ్యాత కంపెనీ ఎయిర్ బస్ కోసం ఏపీ ముందడుగు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన కొనసాగుతోందని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ వివరణకు ఎయిర్‌బస్ బోర్డు సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ చర్చలు సఫలం అయితే.. త్వరలో భారత్‌కు ఏరోస్పేస్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం