Minister Nimmala: రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ
ABN , Publish Date - Mar 10 , 2025 | 02:06 PM
Minister Nimmala Ramanaidu: రూ. 8 కోట్ల వ్యయంతో యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వివిధ మురుగు కాలువల ప్రక్షాళనకు రూ. 16 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయని అన్నారు.

పశ్చిమగోదావరి: పోలవరం ఎడమ కాల్వ పనులు ఈ ఏడాది జూన్ నెల నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగునీరు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2026 జూన్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మట్లాడారు. ఏడు వందల కిలోమీటర్ల ప్రవహించి రాయలసీమను సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ప్రాజెక్టు పనులను వేగంగా చేపట్టామని మంత్రి నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు.
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 99 పనుల కోసం రూ. 37.63 కోట్లు కేటాయించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాలకొల్లు పట్టణంలో పది వార్డుల ఏరియాను ముంచెత్తుతున్న దమయ్యపర్తి కోడు ప్రక్షాళనకు రూ. 14 కోట్లు మంజూరు చేశామన్నారు. రూ. 8 కోట్ల వ్యయంతో యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వివిధ మురుగు కాలువల ప్రక్షాళనకు రూ. 16 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కాజ, మాదవయ్యపాలెం స్లూయిస్ మరమ్మతులకు రూ. 9 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు చేశామని అన్నారు.చింతలపూడి ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Mandipalli : ఆ లెక్కలు తీస్తా.. మంత్రి మండిపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: అవినీతి విషయంలో సహించేది లేదు..
BJP MLC candidate: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమువీర్రాజు
Read Latest AP News And Telugu News