CM Chandrababu: మంత్రులు ఇలా చేస్తే సహించేది లేదు.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:21 PM
కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు.
అమరావతి, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆధ్వర్యంలో ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ(గురువారం) జరగుతోంది. ఈరోజు ఉదయం 10:30కు కేబినెట్ భేటీ ఏపీ సచివాలయంలో ప్రారంభమైంది. మొత్తం 44 అంశాలపై మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు.
మంత్రులు క్రమశిక్షణ పాటించాలి..
అయితే, కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రివర్గ సమావేశానికి ఆలస్యంగా వస్తే ఎలా అని ప్రశ్నించారు. కనీసం సరైన క్రమశిక్షణ పాటించాలి కదా అని మందలించారు. మంత్రి మండలి సమావేశం ఈరోజు ఉదయం 10:30 గంటలకు అని ముందే తెలుసు కదా అని నిలదీశారు. ఈ సమావేశానికి తగ్గినట్లుగా మంత్రులు ఎందుకు ప్లాన్ చేసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సారి నుంచి కేబినెట్ భేటీకి ఆలస్యంగా వస్తే సహించేది లేదని మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు...
కాగా, కేబినెట్ సమావేశం అనంతరం అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. పార్టీ సెంట్రల్ ఆఫీస్‌లో ఈ రోజు(గురువారం) పార్టీ నేతలతో సీఎం భేటీకానున్నారు. మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా అధ్యక్షులు నియామకంపై త్రిసభ్య కమిటీ వేశారు సీఎం చంద్రబాబు.
త్రిసభ్య కమిటీపై చర్చ..
ఇటీవల త్రిసభ్య కమిటీపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ తాజాగా త్రిసభ్య కమిటీలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా కమిటీల నియామకంపై ఈ రోజు త్రిసభ్య కమిటీలతో చర్చించనున్నారు. అనంతరం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో కూడా సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
Read Latest AP News And Telugu News