CM Chandrababu: బెల్టు షాపులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్..అధికారులకు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:46 PM
బెల్టు షాపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): బెల్టు షాపులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులతో ఇవాళ(సోమవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆదాయం కాదని.. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించాలని వ్యాఖ్యానించారు. లాటరీ విధానం, రిటైలర్ మార్జిన్ పెంపుపై పున:పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ మద్యం బాటిల్ పైనా ప్రత్యేక గుర్తింపు నెంబర్ ఉండాలని స్పష్టం చేశారు. బెల్టు షాపుల నియంత్రణకు హర్యానా మోడల్‌పై అధ్యయనం చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబుతో శంకరరావు భేటీ..
మరోవైపు.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె. శంకరరావు కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో బీసీలకు స్ధానిక సంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేసి గవర్నర్ ఆమోదానికి పంపించారని ప్రస్తావించారు. ఏపీలో కూడా బీసీలకు స్ధానిక సంస్ధల్లో వారి జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని విజ్జప్తి చేశారు. తమ విజ్జప్తి పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని శంకరరావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పవన్ కల్యాణ్‌ను కలిసిన యువ ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా.. ఎందుకంటే..
ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News