CM Chandrababu: ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ కథనం.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2025-01-28T17:16:25+05:30 IST

CM Chandrababu: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘‘ రైతు కడుపు చల్లగా’’ వచ్చిన కథనంపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటూరు వ్యవసాయ మార్కెట్‌లో రైతుల కోసం అధికారులు భోజనాన్ని అందజేస్తున్నారు. ఈ విషయంపై అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.

CM Chandrababu: ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ కథనం.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
CM Chandrababu

అమరావతి: ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ కథనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో గుంటూరు మార్కెట్ యార్డు అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ రోజు ఏబీఎన్‌లో‘‘ రైతు కడుపు చల్లగా’’ అంటూ కథనం ప్రసారమైంది. పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతన్నలకు ఆహారం అందిస్తున్న వైనంపై కథనం ప్రచురితమైంది. తమ పంటను అమ్ముకోడానికి గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతులకు ఉచితంగా అల్పాహారాన్ని, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. రూ. 2 ల నామమాత్ర రుసుముతో వారికి సెంట్రలైజడ్ ఏసీ సదుపాయంతో విశ్రాంతి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించిన అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని సీఎం చంద్రబాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్

Read Latest AP News And Telugu News

Updated Date - 2025-01-28T17:46:17+05:30 IST